‘యశోద’ సీక్వెల్‌కి సిద్ధమవుతోందా.?
- November 18, 2022
సమంత ప్రధాన పాత్రలో వచ్చిన ‘యశోద’ సినిమా రీసెంట్గా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా టైమ్‌లోనే సమంత అనారోగ్యం బారిన పడింది. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న సమంత త్వరగా కోలుకోవాలని అందరూ ఆశిస్తున్నారు.
అలాగే, ముఖ్యంగా ‘యశోద’ టీమ్ గట్టిగా కోరుకుంటోంది. ఎందుకంటే, ‘యశోద’ సినిమాకి సీక్వెల్స్ తీసే యోచనలో టీమ్ వున్నట్లు తెలుస్తోంది. దర్శకులు హరి, హరీష్ ఆల్రెడీ ‘యశోద 2’, అలాగే ‘యశోద 3’ కి సంబంధించిన స్టోరీ లైన్లు సిద్ధం చేసేశారట.
సమంత అనారోగ్యం నుంచి కోలుకొని వచ్చి, ‘యస్’ అంటే సీక్వెల్స్ పట్టాలెక్కించేయడమే తరువాయి అంటున్నారు. ప్రొడ్యూసర్లు కూడా ‘యశోద’ సీక్వెల్స్ విషయంలో సంతృప్తిగా వున్నట్లు తెలుస్తోంది. ‘ఎఫ్2’ ఫ్రాంచైచీల మాదిరి, ‘యశోద’ని కూడా ప్రాంఛైజీల్లా తెరకెక్కించాలనుకుంటున్నారట.
రెండు, మూడు పార్టుల్లో కూడా వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కోసం కీలక పాత్రలుండబోతున్నాయట. ఈ టోటల్ ప్రాజెక్ట్ సెట్ అవ్వాలంటే, సమంత పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావల్సిన అవసరం వుంది. లెట్స్ హోప్.!
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!