‘బిగ్’ స్ట్రాటజీ: రేవంత్, శ్రీహాన్‌ల ముందు ఆది రెడ్డి పాచికలు పారలేదుగా.!
- November 18, 2022
బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. ఈ టాస్క్ కోసం ఇంటి సభ్యులు హోరా హోరీ పోరాటం చేస్తున్నారు. ఇంతవరకూ ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వని ఇనయా ఈ సారి ఎలాగైనా కెప్టెన్సీ సాధించాలన్న కసితో వుంది.
అయితే, తనకు పోటీగా బరిలో వున్న రేవంత్, శ్రీహాన్ నుంచి ఆమె తనను తాను డిఫెండ్ చేసుకోలేకపోయింది. లాస్ట్ మినిట్ వరకూ తనవంతు బెస్ట్ ఇచ్చింది కానీ, మగవాళ్ల బలం ముందు ఆమె గెలవలేకపోయింది. ఫైనల్‌గా ఫ్రెండ్స్ అయిన శ్రీహాన్, రేవంత్‌లలో రేవంత్ గెలిచి రెండోసారి ఇంటి కెప్టెన్ అయ్యాడు.
లాస్ట్ మినిట్‌లో కెప్టెన్సీని కోల్పోయిన ఇనయా ఆవేదన వ్యక్తం చేసింది. ఆది రెడ్డి తనదైన స్ర్టాటజీతో సింపతీ గెయిన్ చేసే ప్రయత్నం చేశాడు కానీ, అతని పాచికలు పారలేదు శ్రీహాన్, రేవంత్‌ల ముందు.
రేవంత్‌పై ఫైమా పిట్ట కొంచెం, కూత ఘనం అన్నట్టుగా విరుచుకుపడింది. ఎందుకని గతంలో మాదిరి ఎంటర్టైన్ చేయలేకపోతున్నావ్.. అని ఆడియన్స్ నుంచి వచ్చిన ప్రశ్నకి ఫైమా ఘాటుగా సమాధానమిచ్చింది. తాను ఫన్ మీద కంటే, గేమ్ మీదనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నానని వివరణ ఇచ్చింది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!