హీరోయిన్‌గా కూతురి ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన రోజా.!
- November 18, 2022
యాక్టర్ పిల్లలు యాక్టర్సే అవ్వాలి. డాక్టర్ పిల్లలు డాక్టర్సే అవ్వాలి.. అనేమీ రూల్ లేదు కదా. డాక్టర్లు యాక్టర్లు అవ్వొచ్చు. యాక్టర్లుగా రాణిస్తూనే డాక్టర్ వృత్తినీ చేయొచ్చు. అయితే, ఇప్పుడీ విషయం ఎందుకంటారా.?
ఒకప్పటి స్టార్ హీరోయిన్, నేటి ప్రముఖ రాజకీయ నాయకురాలు అయిన రోజా కుమార్తె అన్షు మాలిక గురించి. గత కొన్ని రోజులుగా రోజా ముద్దుల తనయ అన్షు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందంటూ ప్రచారం జరుగుతోంది.
అందంలో అచ్చు అమ్మను పోలిన అన్షు కొన్ని బుల్లితెర షోలలో తల్లితో పాటూ కలిసి కనిపించింది. నిజమే.! హీరోయిన్‌గా ఎలాంటి వంకలు పెట్టడానికి లేని అందం ఆమె సొంతం. కానీ, డాటర్ ఆఫ్ రోజా. చాలా తెలివైనది అన్షు.
రీసెంట్‌గా ఓ కార్యక్రమంలో తన కూతురు తెరంగేట్రంపై వస్తున్నప్రచారానికి రోజా తనదైన క్లారిటీ ఇచ్చారు. నటన అనేది ఓ వరం. తన పిల్లలు నటన వైపు వస్తారంటే ఎలాంటి అభ్యంతరాల్లేవ్. అన్నింటికీ మించి ఓ నటిగా తానెంతో సంతోషిస్తానని రోజా చెప్పారు.
అయితే, తన కూతురు అన్షు మాత్రం హీరోయిన్ అవ్వాలనుకోవడం లేదు. ఆమె సైంటిస్ట్ కావాలనుకుంటోంది.. అని షాకిచ్చారు రోజా. సో, అన్షు మీద వస్తున్న పుకార్లకు రోజా క్లారిటీతో చెక్ పడ్డట్లేనన్నమాట.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!