రాహుల్ గాంధీకి బాంబు బెదిరింపు లేఖ...
- November 18, 2022
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా ఇండోర్ చేరుకున్నారు. అయితే రాహుల్ గాంధీకి ప్రాణహానికి సంబంధించి బెదిరింపులు వచ్చాయి. బాంబులతో చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. జోడో యాత్ర సాగే మార్గంలోని ఓ స్వీట్ షాప్‌లో బెదిరింపు లేఖ వదిలి వెళ్లారు దుండగులు. ఈ లేఖ తీవ్ర కలకలం రేపుతోంది. రాహుల్ గాంధీ భద్రతా సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. స్వీట్ షాపులో లేఖను వదిలి వెళ్లిన వ్యక్తి కోసం ఇండోర్ పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది వెతుకుతున్నారు. జూని ఇండోర్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో అమర్చిన సీసీటీవీ ఫుటేజీని నిశితంగా పరిశీలిస్తున్నారు పోలీసులు.
కాగా, నవంబర్ 24న రాహుల్ గాంధీ ఇండోర్‌లోని ఖల్సా స్టేడియంలో రాత్రి విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో బాంబ్ బెదిరింపుల లేఖ తీవ్ర కలకలం రేపుతోంది. అయితే, ఈ లేఖను ఎవరో తుంటరి వాళ్లు చేసిన పనిగా భావిస్తున్నారు పోలీసులు. అయినప్పటికీ పకడ్బందీగా భద్రతా చర్యలు చేపట్టారు అధికారులు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న సెక్యూరిటీ సిబ్బంది.. విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక