అలా అయితే, తెలుగు సినిమాని అడ్డుకుంటామంటోన్న తమిళ తంబీలు.!

- November 19, 2022 , by Maagulf
అలా అయితే, తెలుగు సినిమాని అడ్డుకుంటామంటోన్న తమిళ తంబీలు.!

ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన సొంత బ్యానర్‌లో రూపొందిస్తున్న సినిమా ‘వారసుడు’. తమిళ హీరో విజయ్ లీడ్ రోల్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాని మొదట స్ట్రెయిట్ తెలుగు సినిమా అన్నారు. ఆ తర్వాత బైలింగ్వల్ అన్నారు. ఇప్పుడేమో తమిళ సినిమాకి తెలుగు డబ్బింగ్ మాత్రమే అని తేల్చారు.
ఓకే, అది కూడా ఓకే. కానీ, అసలు విషయమేంటంటే, సంక్రాంతి సీజన్‌లో తెలుగులో రిలీజ్ అవుతోన్న పెద్ద సినిమాలకు పోటీగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అత్యధిక ధియేటర్లలో రిలీజ్ చేస్తూ స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు ధియేటర్లు లేకుండా చేస్తున్నారు. 
అదే అసలు గొడవ. దాంతో తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి ఈ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయ్. ఆ అభ్యంతరాలను తమిళ తంబీలు వ్యతిరేకిస్తున్నారు. మీ తెలుగు సినిమాల్నీ మా తమిళంలో రిలీజ్ చేస్తుంటే ఆదరిస్తున్నాం. మా తమిళ సినిమాల విషయంలో మీరు ఇలా చేస్తారా.? ఇలా అయితే, ఇకపై మీ తెలుగు సినిమాల్ని తమిళంలో రిలీజ్ అవ్వకుండా అడ్డుకుంటామంటూ గోల చేస్తున్నారు. 
ఇలా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నవారిలో రీసెంట్‌గా రామ్ సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ లింగు స్వామి కూడా వుండడం గమనార్హం.!

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com