తెలుగులో అరుదైన రికార్డు నెలకొల్పిన కాంతార
- November 19, 2022
బెంగుళూరు: కన్నడ మూవీ కాంతార ఇప్పటికే అనేక భాషల్లో అనేక రికార్డ్స్ నెలకొల్పి , అందర్నీ ఆశ్చర్య పరచగా..తాజాగా తెలుగు లో మరో అరుదైన రికార్డు నెలకొల్పింది. కన్నడలో సెప్టెంబరు 30న రిలీజైన ఈ మూవీ హిట్ టాక్ని సొంతం చేసుకుని.. అక్టోబరులో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ విడుదలైంది. రిలీజైన అన్ని భాషల్లోనూ ఊహించని విధంగా బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
ఈ సినిమా ఒక్క తెలుగులోనే ఏకంగా రూ.65 కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగులో కలెక్షన్ల పరంగా చూసుకుంటే అత్యధికంగా వసూలు చేసిన డబ్బింగ్ సినిమా జాబితాలో కాంతార నాల్గో స్థానంలో నిలిచింది. లెక్కల పరంగా చూసుకుంటే కేజీఎఫ్-2 మూవీ తెలుగులో రూ.185 కోట్లని కలెక్ట్ చేయగా.. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రొబో, రొబో 2.0 వరుసగా రూ.100 కోట్లు, రూ.72 కోట్లతో టాప్-3లో ఉన్నాయి. తాజాగా కాంతారా రూ.65 కోట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఇంకా థియేటర్స్ లలో కాంతారా మూవీ కొనసాగుతుంది. తెలుగులో ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ బ్యానర్ ఫై అల్లు అరవింద్ రిలీజ్ చేసారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు