ఇండియన్ రేసింగ్ లీగ్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
- November 19, 2022
హైదరాబాద్: ఇండియన్ రేసింగ్ లీగ్ ను మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. హుస్సేన్‌సాగర్ నెక్లెస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన 2.7 కిలోమీటర్ల ప్రత్యేక ట్రాక్‌లో గంటకు 300 కిలోమీటర్ల వేగంతో కార్లు దూసుకెళ్లాయి. భారత్‌లో నిర్వహిస్తున్న తొలి స్ట్రీట్ సర్క్యూట్ కాగా.. ఇందులో హైదరాబాద్‌లో జరుగుతుండడం విశేషం. రేస్‌లో మొత్తం 24 మంది జాతీయ, అంతర్జాతీయ రేసర్లు పాల్గొనగా.. హెచ్ఎండీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, హీరో నిఖిల్ కూడా హాజరయ్యారు. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ సహా ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఆరు జట్ల నుంచి 12 కార్లు.. 24 మంది డ్రైవర్లు రేస్‌లో ఉన్నారు. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమ్ నుంచి నగరానికి చెందిన ప్రముఖ ఫార్ములా రేసర్ కొండా అనిందిత్ రెడ్డి బరిలో ఉన్నాడు. ఈ పోటీలను రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ… అంతర్జాతీయ ఆటోమొబైల్ ఫెడరేషన్ నిర్వహిస్తున్నాయి. దీనిని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు