F1 అబుధాబి: ట్రాఫిక్ డైవర్షన్స్
- November 20, 2022
యూఏఈ: యాస్ సర్క్యూట్లో ఫార్ములా 1 ఫైనల్ రేస్‌లు జరుగుతున్న నేపథ్యంలో అబుధాబి పోలీసులు ట్రాఫిక్ డైవర్షన్స్ ప్రకటించారు. యాస్ డ్రైవ్ టన్నెల్ ద్వారా యాస్ ఐలాండ్‌కు వచ్చే వారి కోసం షేక్ ఖలీఫా బిన్ జాయెద్ స్ట్రీట్ నుండి 342వ కూడలి వైపుగా ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుందన్నారు. యాస్ మాల్ సినిమా ప్రవేశ ద్వారం సమీపంలో ఉన్న అదనపు పార్కింగ్ స్థలాలకు పార్కింగ్ మార్చబడిందని, పోలీసులు యాస్ మాల్‌ను సందర్శించే వాహనదారులను గమనించాలని సూచించారు.
రెడ్ బుల్ ఫార్ములా వన్ ఎతిహాద్ ఎయిర్వేస్ అబుధాబి గ్రాండ్ ప్రిక్స్ ఫ్రంట్ గ్రిడ్‌ను మాక్స్ వెర్స్టాపెన్, సెర్గియో పెరెజ్ 1,2 స్థానాల్లో పూర్తి చేశారు. డబుల్ వరల్డ్ ఛాంపియన్ అయిన వెర్స్టాపెన్.. ఈ సంవత్సరంలో 15వ విజయాన్ని సొంతం చేసుకోవాలని, తద్వారా 14 రేసు విజయాల తన స్వంత రికార్డును తిరగరాయాలని కోరుకుంటున్నాడు. ఇప్పటికే ఒకే సీజన్లో విజయాలు సాధించిన రేసర్ గా వెర్స్టాపెన్ నిలిచాడు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







