షువైఖ్ బీచ్‌ని క్లీన్ చేసిన వాలంటీర్లు

- November 20, 2022 , by Maagulf
షువైఖ్ బీచ్‌ని క్లీన్ చేసిన వాలంటీర్లు

కువైట్: కువైట్ బీచ్‌లలో సముద్ర తాబేళ్లను పునరుద్ధరించడంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కువైట్‌లోని జపనీస్ సొసైటీ తన ‘బీచ్ క్లీనప్ క్యాంపెయిన్’ 22వ ఎడిషన్‌ను షువైఖ్ బీచ్‌లో నిర్వహించింది. "ఆపరేషన్ టర్టిల్" పేరుతో జరిగిన ఈ ప్రచారానికి కువైట్‌లోని జపాన్ రాయబారి మోరినో యసునారి, ఎన్విరాన్‌మెంట్ పబ్లిక్ అథారిటీలో టెక్నికల్ అఫైర్స్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లా అల్-జైదాన్, కువైట్ ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ సొసైటీ (కెఇపిఎస్) బోర్డు సభ్యుడు జెనాన్ బహ్జాద్, కువైట్ డిప్యూటీ చైర్మన్ పాల్గొన్నారు. వీరితోపాటు బాయ్ స్కౌట్స్ అసోసియేషన్ హుస్సేన్ అల్-మక్సీద్, సెక్రటరీ జనరల్ ఇబ్రహీం అల్-ఈద్, కువైట్ ఆయిల్ కంపెనీ (KOC)లో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హనన్ అల్-ఇబ్రహీం, ప్రైవేట్ కంపెనీలు, కువైట్ ప్రభుత్వ పాఠశాలల నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ‘ఆపరేషన్ టర్టిల్’ బీచ్ క్లీనింగ్ క్యాంపెయిన్‌ను నిర్వహించారు. కువైట్ లో బీచ్ క్లీనప్‌ల నుండి ఎడారిలో మొక్కలు నాటడం, పెంచడం వరకు ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలను తాము చేపట్టినట్లు జపనీస్ సొసైటీ తెలిపింది. ‘‘పర్యావరణ పరిశుభ్రత ప్రజారోగ్యానికి సంబంధించినది" అని అవగాహన కల్పించేందుకు షువైఖ్ బీచ్‌ను శుభ్రపరచడం జరిగిందని వివరించారు. సముద్ర, భూసంబంధమైన పర్యావరణాన్ని పరిరక్షించడం, వాతావరణ మార్పులను పరిమితం చేయడం, కువైట్ పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని అనుసరించే కార్యక్రమాల్లో పిల్లలను భాగస్వామ్యం చేస్తూ వారిలో అవగాహన కల్పిస్తున్నట్లు జపనీస్ సొసైటీ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com