యూఏఈ గోల్డెన్ వీసా: కనీస జీతం తగ్గింపుతో పెరిగిన డిమాండ్

- November 21, 2022 , by Maagulf
యూఏఈ గోల్డెన్ వీసా: కనీస జీతం తగ్గింపుతో పెరిగిన డిమాండ్

యూఏఈ: నైపుణ్యం కలిగిన నిపుణుల కోసం యూఏఈ తెచ్చిన గోల్డెన్ వీసాలకు డిమాండ్ పెరుగుతున్నది. జీతం నిబంధనల్లో మార్పులు చేయడంతో దీర్ఘకాలిక రెసిడెన్సీకి డిమాండ్ విపరీతంగా పెరిగింది. దుబాయ్‌లోని అరేబియన్ బిజినెస్ సెంటర్ (అమెర్ సెంటర్ - షేక్ జాయెద్ రోడ్) అక్టోబర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించినప్పటినుండి ప్రతిరోజూ దాదాపు 30-40 గోల్డెన్ వీసాలను జారీ చేస్తోన్నట్లు సెంటర్‌లో ఆపరేషన్స్ మేనేజర్ ఫిరోసేఖాన్ తెలిపారు. తమకు వచ్చే దరఖాస్తుల్లో చాలా వరకు నిపుణులు, వ్యాపారవేత్తలకు సంబంధించినవేనని వెల్లడించారు. ఈ సంవత్సరం 12,000 కంటే ఎక్కువ దీర్ఘకాలిక రెసిడెన్సీ వీసాలను జారీ చేసినట్లు తెలిపారు.  గోల్డెన్ వీసా పథకంలో భాగంగా ఎక్కువ మంది నైపుణ్యం కలిగిన నిపుణులు దీర్ఘకాలిక రెసిడెన్సీని పొందవచ్చు. కనీస నెలవారీ జీతం Dh50,000 నుండి Dh30,000కి తగ్గించారు. వైద్యం, ఇంజనీరింగ్, సమాచార సాంకేతికత, వ్యాపారం, పరిపాలన, విద్య, చట్టం, సంస్కృతి, సామాజిక శాస్త్రాలు తదితర విభాగాల్లో నిపుణులు గోల్డెన్ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు.

జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) ప్రకారం.. 2019, 2022 మధ్య దుబాయ్‌లో 151,600 గోల్డెన్ వీసాలు జారీ చేయబడ్డాయి. యూఏఈలోని దరఖాస్తుదారుల కోసం వీసా ధర Dh2,800, Dh3,800 మధ్య ఉంటుంది. గోల్డెన్ వీసా అనేక ప్రయోజనాలను అందిస్తోంది. ఆరు నెలలకు పైగా యూఏఈ వెలుపల ఉన్నా రెసిడెన్సీ చెల్లుబాటుపై ప్రభావం చూపదు.  అలాగే వీసా హోల్డర్లు దీర్ఘకాలిక రెసిడెన్సీపై తల్లిదండ్రులను స్పాన్సర్ చేయవచ్చు. దీంతోపాటు వయస్సు పరిమితులు లేకుండా పిల్లలకు స్పాన్సర్ చేయవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com