CBSE 10+2 ఫార్మాట్ రద్దు.. దానిస్థానంలో 5+3+3+4 స్ట్రక్చర్!
- November 21, 2022
కువైట్: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) 2020 సిఫార్సుల ఆధారంగా.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) వచ్చే విద్యా సంవత్సరానికి కొత్త ఫార్మాట్ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 10+2 విధానాన్ని తొలగించాలని యోచిస్తున్నట్లు తెలిపింది. దాని స్థానంలో 5+3+3+4 విద్యా విధానాన్ని ప్రకటించనుందని సమాచారం. త్వరలోనే కొత్త విధానానికి మారేందుకు అవసరమైన నిబంధనల రూపకల్పన కోసం ఓ కమిటీని వేయనున్నట్లు సమాచారం. NEP 2020లోని కొత్త బోధనా నిర్మాణం పిల్లల విద్యను నాలుగు దశలుగా విభజించింది. మొదటిది ఐదు సంవత్సరాల ఫౌండేషన్ దశ, ప్రిపరేటరీ, మిడిల్ దశలు ఒక్కొక్కటి మూడు సంవత్సరాలు ఉండనుంది. ఇక సెకండరీ దశ నాలుగు సంవత్సరాలు ఉంటుంది. NEPలో భాగంగా 10 నుండి 12 తరగతులకు బోర్డ్ పరీక్షలు కొనసాగుతుండగా.. కోచింగ్ తరగతుల అవసరాన్ని తొలగించడానికి ఈ పరీక్షల విధానంలో మార్పు చేయనున్నారు. NEP ప్రకారం.. విద్యార్థులు విద్యా సంవత్సరంలో రెండు పర్యాయాలు పరీక్షలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..
- ఫుట్బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీకి ‘Z’ కేటగిరీ భద్రత
- భారత్ టారిఫ్ల పై ట్రంప్కు అమెరికాలోనే వ్యతిరేకత
- ఏపీ: 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
- భారత్ కు చేరుకున్న ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ
- గడువు ముగిసిన పదార్థాలు.. రెస్టారెంట్ యజమానికి జైలుశిక్ష..!!
- ఖతార్ లో కొత్త తరం వాహన లైసెన్స్ ప్లేట్లు..!!
- వాతావరణ ప్రమాదాలు, సునామీపై జాతీయ అవగాహన..!!







