ఎమ్మెల్యేలకు ఎర కేసు.. జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు
- November 21, 2022న్యూఢిల్లీ: ఎమ్మెల్యేలకు ఎర కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. తమ అరెస్టును సవాల్ చేస్తూ రామచంద్ర భారతి సహా ముగ్గురు నిందితులు దాఖలు చేసిన నిందితులు దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మరోవైపు బెయిల్ పిటిషన్పైనా న్యాయస్థానం స్పందించింది. రెగ్యులర్ బెయిల్ కోసం హై కోర్టుకు ఆశ్రయించే హక్కు ఉందని నిందితులకు సూచించింది. తామైతే ఇప్పటికే బెయిల్ ఇచ్చేవారమని జస్టిస్ గవాయ్ అన్నారు. పోలీసుల రిమాండ్ రిపోర్టును ట్రయల్ కోర్టు తిరస్కరించిన విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు ఆక్షేపణీయమన్న సర్వోన్నత న్యాయస్థానం ఆయన చూపిన కారణాలు సంతృప్తికరంగా లేవని స్పష్టం చేసింది.
నిందితుల తరపు న్యాయవాది తన్మయ్ మెహతా వాదనలు వినిపించారు. కేసులో ఎలాంటి రికవరీ జరగలేదని, లంచం తీసుకున్న వారికే పీసీ చట్టం వర్తిస్తుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అరెస్ట్ చట్ట విరుద్దంగా జరిగిందన్న కారణంతోనే ట్రయల్ కోర్టు రిమాండ్ను తిరిస్కరించిందని చెప్పారు. దర్యాప్తునకు సహకరిస్తున్నందున వారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని ధర్మాసనానికి విన్నవించారు. కేసు దర్యాప్తు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో జరిగేలా ఆదేశించాలని కోరారు.
ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, సిద్ధార్థ్ లూత్రాలు అవినీతిపరులను పట్టుకునేందుకు ట్రాప్ సిద్ధం చేసినట్లు చెప్పారు. ఆ సమయంలో పోలీసులు అక్కడే ఉన్నారని చెప్పారు. ఈ కేసులో ముందుగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశమున్నందున వారిని అక్కడికక్కడ అరెస్ట్ చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తులు ఈ కేసులో జోక్యం చేసుకోలేమని చెప్పారు.
తాజా వార్తలు
- సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం
- విద్యార్థుల నుంచి లంచం..టీచర్కు మూడేళ్ల జైలు, 5,000 దిర్హామ్ల జరిమానా..!!
- సౌదీయేతరులతోనే 64.8% సౌదీల వివాహాలు..అధ్యయనం వెల్లడి..!!
- షేక్ జాయెద్ రోడ్లో యాక్సిడెంట్.. 4.2 కి.మీ పొడవున ట్రాఫిక్ జామ్..!!
- దోహాలో రెండు కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత..!!
- కువైట్ లో తక్షణ చెల్లింపు కోసం 'WAMD' సర్వీస్ ప్రారంభం..!!
- మెట్రో రైడర్స్ కు గుడ్ న్యూస్.. ఈ-స్కూటర్లపై నిషేధం ఎత్తివేత..!!
- షార్ట్స్లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్
- కాంగో పడవ ప్రమాదంలో 78 మంది జల సమాధి
- రేపటి నుంచి భారత్–బంగ్లా టీ20 టిక్కెట్ల విక్రయం