నేడు, రేపు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు
- November 21, 2022
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం స్థిరంగా కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఇది నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని, రాగల 24 గంటల్లో తమిళనాడు, ఏపీ దక్షిణ కోస్తా దిశగా పయనించే అవకాశముందని తెలిపింది. దీని ప్రభావం దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపై ఇప్పటికే ప్రారంభమైందని, చిత్తూరు, నెల్లూరు, విజయవాడ జిల్లాల్లో తేలికపాటివర్షాలు కురిశాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. రాగల 24 గంటల్లో మరికొన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయని వివరించింది.
అటు, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) కూడా వాయుగుండంపై తాజా బులెటిన్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నెల్లూరుకు తూర్పు ఆగ్నేయ దిశగా 420 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు ఐఎండీ వెల్లడించింది. ఈ సాయంత్రానికి ఇది మరింత బలపడుతుందని, అయితే ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరువగా వచ్చే కొద్దీ, రేపటి ఉదయానికి బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని అంచనా వేసింది. నేడు, రేపు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అదే సమయంలో ఉత్తరాంధ్రలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నెల 23న రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







