నవంబర్ 22 నుండి ‘జ్యువెలరీ అరేబియా’
- November 21, 2022
బహ్రెయిన్: మిడిల్ ఈస్ట్‌లోని అతిపెద్ద ఆభరణాలు, వాచ్ ఎగ్జిబిషన్ ‘జ్యువెలరీ అరేబియా 2022’ నవంబర్ 22న ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్‌లో ప్రారంభమవుతుంది. జ్యువెలరీ అరేబియా 30వ ఎడిషన్ కోసం ప్రపంచంలోని అత్యుత్తమ ఆభరణాలు, వాచ్ బ్రాండ్ ల సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి. ఈ ఎగ్జిబిషన్ నవంబర్ 26 వరకు కొనసాగుతుంది.
దాదాపు 30కి పైగా దేశాల నుండి 650కి పైగా జ్యువెలరీ, వాచ్ తయారీ సంస్థలు స్టాల్స్ ఒకేచోట సందడి చేయనున్నాయి. పెర్ల్ డిస్కవరీ జోన్, బహ్రెయిన్ ఇన్స్టిట్యూట్ ఫర్ పెరల్స్ & జెమ్‌స్టోన్స్ (DANAT) భాగస్వామ్యంతో ఈ ఎగ్జిబిషన్ ను నిర్వహిస్తున్నారు.
జ్యువెలరీ అరేబియా 2022.. హాల్స్ 3, 5, 6, 7, 8లో నిర్వహించనున్నారు. నవంబర్ 22 - 25 తేదీలలో సాయంత్రం 4 నుండి రాత్రి 10 గంటల వరకు.. నవంబర్ 26న మధ్యాహ్నం 12 నుండి రాత్రి 10 గంటల వరకు ఎగ్జిబిషన్ తెరిచి ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు.
తాజా వార్తలు
- యూరప్‌కు అక్రమంగా తరలిస్తున్న 7 కోట్ల సిగరెట్లను అడ్డుకున్న దుబాయ్ కస్టమ్స్
- ADNOC నౌక పై ఇరాన్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్‌లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్‌కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!







