విదేశీ స్కూల్స్ బ్రాంచీల ప్రారంభానికి కువైట్ ఆమోదం

- November 21, 2022 , by Maagulf
విదేశీ స్కూల్స్ బ్రాంచీల ప్రారంభానికి కువైట్ ఆమోదం

కువైట్: విదేశీ పాఠశాలల శాఖలను ప్రారంభించేందుకు కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ తాజాగా ఆమోదం తెలిపింది. పాఠశాలలను విద్యార్థుల ఇళ్లకు దగ్గరగా ఏర్పాట చేయడానికి అనేక గవర్నరేట్‌లలోని ఫారీన్ స్కూళ్ల నుంచి దరఖాస్తులు అందాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ముఖ్యంగా హవల్లీ, ఫర్వానియా,  అహ్మదీలలో కొత్త శాఖలను ప్రారంభించేందుకు విదేశీ ప్రైవేట్ పాఠశాలలు విద్యా మంత్రిత్వ శాఖను కోరాయన్నారు. ఫారీన్ స్కూల్స్ ముందుగా కొత్త ప్రదేశాలలో ఏర్పాటుకు ఆమోదం పొంది, నిబంధనల ప్రకారం తరగతి గదుల లభ్యతను కలిగి, భద్రత - ప్రమాదాల నివారణ చర్యలను చేపట్టాలని మంత్రిత్వ శాఖ సూచించింది. ఒకే గవర్నరేట్‌లో ఒకటి కంటే ఎక్కువ పాఠశాలలు ఏర్పాటు చేసుకోవచ్చని, సాధారణంగా కువైట్‌లోని మొత్తం జనాభాలో భారతీయులు, పాకిస్థానీ, ఫిలిపినో జాతీయులు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా, కువైట్‌లో అరబ్ విశ్వవిద్యాలయాల ప్రైవేట్ శాఖలను తెరవడానికి కువైట్‌లోని ప్రైవేట్ విశ్వవిద్యాలయాల కౌన్సిల్ నిరాకరించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com