యూఏఈ-ఇండియా ప్రయాణికులకు ఎయిర్ ఇండియా కొత్త నిబంధనలు

- November 21, 2022 , by Maagulf
యూఏఈ-ఇండియా ప్రయాణికులకు ఎయిర్ ఇండియా కొత్త నిబంధనలు

యూఏఈ: యూఏఈతో పాటు ఇతర దేశాలకు వెళ్లే విమాన ప్రయాణికులు తమ పాస్‌పోర్ట్‌లలో వారి ప్రాథమిక (మొదటి పేరు), ద్వితీయ (ఇంటిపేరు) పేర్లు ఉండేలా చూసుకోవాలని Air India Express ప్రకటించింది. ఈ మేరకు యూఏఈలోని అన్ని ట్రావెల్ ఏజెంట్లకు ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఎయిర్ ఇండియా కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ఇంటి పేరు లేదా ఇచ్చిన పేరుతో ఒకే పేరు (పదం) ఉన్న ఏదైనా పాస్‌పోర్ట్ హోల్డర్‌ను యూఏఈ ఇమ్మిగ్రేషన్ విభాగం అంగీకరించదు. అలాంటి ప్రయాణీకులను INAD (ప్రయాణానికి అనుమతి లేదు)గా పరిగణిస్తుంది. కొత్త మార్గదర్శకాలు నవంబర్ 21 నుంచి అమలులోకి వస్తాయని ఎయిర్ ఇండియా తెలిపింది. 

ఉదాహరణకు పాస్‌పోర్ట్‌లో ఏదైనా ప్రయాణీకుడి పేరు ఇంటిపేరుతో (ఖాళీ) లేదా అతని/ఆమె ఇచ్చిన పేరు ప్రవీణ్ గా పేర్కొంటే.. ఇంటిపేరుతను (ఖాళీగా) వదిలితే అటువంటి పాస్‌పోర్టులను యూఏఈ ఇమ్మిగ్రేషన్ అంగీకరించదు. వీసా గతంలో జారీ చేసినా అతను/ఆమె ఇమ్మిగ్రేషన్ ద్వారా INAD అవుతాడని ఎయిర్ ఇండియా పేర్కొంది. టూరిస్ట్ లేదా విజిట్ వీసాపై ప్రయాణించే వారికి ఈ నిబంధన వర్తిస్తుందని.. నివాసం లేదా ఉపాధి వీసాలను కొత్త నిబంధన నుంచి మినహాయించాలని సర్క్యులర్ లో ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com