ఇంగ్లండ్‌తో మ్యాచ్.. ఇరాన్ వినూత్న నిరసన!
- November 21, 2022
దోహా: ఖతార్ లో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ లో ఇంగ్లండ్ తో ఇరాన్ తలపడుతోంది. ఆట ఆరంభానికి ముందు ఇంగ్లండ్ తమ జాతీయ గీతాన్ని పాడింది. అయితే, ఇరాన్ మాత్రం తమ దేశ జాతీయ గీతాన్ని పాడలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలతో ఇరాన్ అట్టుడికిపోతున్న విషయం తెలిసిందే. హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌లో ఈ ఆందోళనలు జరుగుతున్నాయి.
కొన్ని వారాల క్రితం హిజాబ్ సరిగా ధరించలేదంటూ పోలీసులు అరెస్టు చేసిన మహ్సా అమిని అనే యువతి పోలీసు కస్టడీలో తీవ్రంగా గాయపడి, మృతి చెందినప్పటి నుంచి ఈ ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆందోళనకారులకు మద్దతుగా, ఇరాన్ ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా ఆ దేశ ఆటగాళ్లు ఫిఫా ప్రపంచ కప్ లో ఆడుతున్న తొలి మ్యాచులో జాతీయ గీతాన్ని ఆలపించలేదు.
ఆట జరుగుతున్న ఖలీఫా అంతర్జాతీయ మైదానంలో ఇరాన్ జాతీయ గీతాన్ని ప్లే చేసిన సమయంలో ఆ దేశానికి చెందిన 11 మంది ఆటగాళ్లూ మౌనంగా ఉండిపోయారు. తమ జట్టు సభ్యులం అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని ఇరాన్ కెప్టెన్ అలీరెజా జహంబఖష్ చెప్పాడు.
తాజా వార్తలు
- ప్రతిష్ఠాత్మక గ్లోబల్ సదస్సుకు కెటిఆర్ కు ఆహ్వానం
- నకిలీ మద్యం మాఫియా పై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్
- 5 లక్షల ఉద్యోగులకు అమెజాన్ లేఆఫ్‌లు
- అబుదాబీలో సీఎం చంద్రబాబు పర్యటన
- సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- లాజిస్టిక్స్, గిడ్డంగుల ఏర్పాటుకు రాష్ట్రానికి రండి
- ఏపీలో షిప్ బిల్డింగ్ యూనిట్‌కి ట్రాన్స్ వరల్డ్ గ్రూప్‌కు ఆహ్వానం
- కువైట్ లో న్యూ ట్రాఫిక్ వయలేషన్..వెహికల్ సీజ్..!!
- ఫుజైరా చిల్డ్రన్స్ బుక్ ఫెయిర్ 2025 రిటర్న్స్..!!
- ట్రాఫిక్ అలెర్ట్.. కార్నిచ్‌లో రోడ్ మూసివేత..!!