ఎమ్మెల్యే కేథరీన్, బన్నీ కోసం సూపర్ విలన్ కానుందా.?
- November 21, 2022
‘సరైనోడు’ సినిమాలో బ్యూటిఫుల్ ఎమ్మెల్యేగా నటించి మంచి మార్కులు కొట్టేసింది ముద్దుగుమ్మ కేథరీన్. రీసెంట్‌గా ‘బింబిసార’లో నటించి మెప్పించింది. తాజాగా కేథరీన్ ‘పుష్ప 2’లో ఛాన్స్ కొట్టేసిందని ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ వున్న ఓ లేడీ క్యారెక్టర్ క్రియేట్ చేశాడట సుక్కు మాస్టర్. అఫ్‌కోర్స్.! ఆల్రెడీ నెగిటివ్ షేడ్స్ రోల్‌లో అనసూయ నటిస్తోందనుకోండి. మొదటి పార్ట్‌లోని దాక్షాయణి పాత్రను ఈ పార్ట్‌లోనూ కంటిన్యూ చేయనున్నాడట. ఆ రోల్‌తో పాటూ, మరో నెగిటివ్ లేడీ రోల్ కూడా వుండబోతోందనీ తెలుస్తోంది.
బహుశా ఆ పాత్ర ఫహాద్ ఫాజిల్ భార్య రోల్ అయ్యుండొచ్చని అనుకుంటున్నారు. ఆ రోల్ అందంగా కనిపిస్తూనే విషం చిమ్మే పాత్రనీ తెలుస్తోంది. ఆ పాత్ర కోసమే కేథరీన్ పేరు పరిశీలిస్తున్నారట. బన్నీ కూడా ఆ రోల్ కోసం కేథరీన్‌నే ప్రిఫర్ చేసినట్టు తెలుస్తోంది.
ఈ ప్రచారం నిజమైతే, కేథరీన్ మరో మంచి రోల్ కొట్టేసినట్లే అంటూ ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు. చూడాలి మరి.
తాజా వార్తలు
- దుబాయ్: ప్రవాసాంధ్రులతో రేపు సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్
- ప్రయాణికులకు RTC ఆత్మీయ స్వాగతం!
- అబుదాబీ పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీల్లో సీఎం చంద్రబాబు
- ఏపీ మీదుగా రెండు హై స్పీడ్ రైలు
- ఫామ్ హౌస్ లో ముఖ్య నేతలతో కెసిఆర్ భేటీ
- అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు
- టర్కిష్ అధ్యక్షుడి గౌరవార్థం సుల్తాన్ ఆతిథ్యం.!!
- హ్యుమన్ ట్రాఫికింగ్ కేసు..నిందితులకు KD 10,000 ఫైన్..!!
- అబ్షర్ ద్వారా 4 కొత్త ఎలక్ట్రానిక్ సివిల్ సేవలు..!!
- సెయిలర్ కోసం కోస్ట్ గార్డ్ సెర్చ్ ఆపరేషన్..!!







