రౌడీ సినిమాలో ఆ సీనియర్ హీరో.! ఈ సారైనా సక్సెస్ అవుతాడా.?
- November 21, 2022తమిళ హీరో మాధవన్‌కి రొమాంటిక్ హీరోగా తెలుగులోనూ సెపరేట్ ఫ్యాన్ బేస్ వుంది. అయితే, ‘సవ్యసాచి’ సినిమా కోసం విలన్ అవతారమెత్తి ఆయన తన గౌరవాన్ని కాస్త చెడగొట్టుకున్నాడు. మంచి నటుడైన మాధవన్ రోల్‌ని పిచ్చి పిచ్చిగా డిజైన్ చేసి కన్‌ఫ్యూజ్ చేశాడు డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాలో.
ఆ సంగతి అటుంచితే, తాజాగా మరో సినిమాతో తెలుగులో సందడి చేయబోతున్నాడట మాధవన్. ఈ సారి రౌడీ స్టార్ కోసం రాబోతున్నాడట. రౌడీ విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషీ’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో మాధవన్ ఓ ఇంపార్టెంట్ రోల్ చయబోతున్నాడనీ తాజాగా అందుతోన్న సమాచారం. అయితే, అది విలన్ రోలా.? కాదా.? అనేది సస్పెన్స్. తొలి ప్రయత్నం బెడిసి కొట్టడంతో, మళ్లీ అలాంటి ప్రయత్నం చేసే ఆలోచన మాధవన్ చేయడంటున్నారు ఆయన ఫ్యాన్స్.
కానీ, స్ట్రాంగ్ రోల్ పడితే, ఎందుకు కాదంటాడు. క్యారెక్టర్స్ డిజైన్ చేయడంలో శివ నిర్వాణకు ప్రత్యేక శైలి వుంది. మరి, మాడీ కోసం నిజంగానే బెస్ట్ రోల్ సిద్ధం చేశాడా.? అసలు రౌడీ సినిమాలో మాడి.. ఈ ప్రచారంలో నిజమెంత.? అనేది తెలియాలంటే లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ సమ్ టైమ్.!
తాజా వార్తలు
- అవినీతి పై కలిసికట్టుగా పోరాటం..!!
- కువైట్ లో జీరో టోలరెన్స్.. వారంలో 4,500 కేసులు నమోదు..!!
- అరేబియా సముద్రంలో $1 బిలియన్ డ్రగ్స్ సీజ్..!!
- ఒమన్ లో స్పెషల్ ఆపరేషన్.. ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో 16 మందితో న్యూ స్టూడెంట్స్ కౌన్సిల్..!!
- మెరియల్ వాటర్ పార్క్ వింటర్ మిరాజ్ ఫెస్ట్ ప్రారంభం..!!
- బస్సు దగ్దం..25 మందికి పైగా సజీవ దహనం
- అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఎపి ముందంజ
- ఏపీ కి గ్లోబల్ పౌర్హౌస్ అన్న నారా లోకేష్
- షేక్ ఖలీఫా బిన్ మొహమ్మద్ వివాహాం..కింగ్ హమద్ హాజరు..!!







