‘హనుమాన్’ టీజర్ టాక్.! తేజ సజ్జా భలే స్టోరీ పట్టేశాడే.!
- November 21, 2022
బుడ్డోడు తేజ సజ్జా ‘జాంబిరెడ్డి’ సినిమాతో హీరో అయిపోయిన సంగతి తెలిసిందే. హీరోగా ‘జాంబి రెడ్డి’ మంచి టాకే సొంతం చేసుకుంది. ఆ తర్వాత ‘అద్భుతం’ అనే సినిమాలో నటించాడు తేజ.
ఇక ఇప్పుడు ‘హనుమాన్’ అనే సూపర్ హీరో పాత్రతో రాబోతున్నాడు. ‘కల్కి’ ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి దర్శకుడు. ‘కల్కి’కి ముందే ‘అ.!’ అనే సినిమాతో ప్రశాంత్ డైరెక్టర్‌గా పరిచయమై, తొలి సినిమాకే వావ్ అనిపించుకున్నాడు. మంచి విజన్ వున్న డైరెక్టర్ ఈయన.
సీనియర్ హీరో రాజశేఖర్‌తో ‘కల్కి’ సినిమా తెరకెక్కించి హాట్ టాపిక్ అయ్యాడు. ఇప్పుడీ డైరెక్టర్ తేజ సజ్జాతో ‘హనుమాన్’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. వచ్చే నెలలో ఈ సినిమా రిలీజ్‌కి ముస్తాబవుతున్న నేపథ్యంలో తాజాగా టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
సూపర్ హీరో ట్రెండీ హనుమాన్ పాత్రలో తేజ కనిపిస్తున్నాడు. విజువల్ ఎఫెక్ట్స్ చాలా చాలా బాగున్నాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. అన్నం వుడికిందో లేదో తెలియాలంటే ఒక్క మెతుకు చూస్తే చాలదూ.. అలా టీజర్‌తోనే మంచి మార్కులు కొట్టేశాడు అటు డైరెక్టర్, ఇటు హీరో.
అమృతా అయ్యర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!
- ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్టు..!!
- యూఏఈలో గీత దాటిన టీచర్లపై 'క్రమశిక్షణా' చర్యలు..!!
- కువైట్ ఇంటర్నెట్ మార్కెట్లో మొబైల్ రూటర్ల ఆధిపత్యం..!!
- కోస్ట్ గార్డ్ పెట్రోల్ తో ఫిషింగ్ బోట్ ఢీ..!!
- గాజాలో కాల్పుల విరమణ.. తదుపరి దశలపై కైరోలో చర్చలు..!!
- కొత్త మోసాల పై యూజర్లకు హెచ్చరిక
- ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు
- డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు...







