తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
- November 23, 2022
తెలంగాణ: తెలంగాణలో గల్ఫ్ కార్మికుల కొరకు ప్రత్యేకంగా “ గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు “ ఏర్పాటు చేయాలని ఈరోజు ఆర్మూర్ లో ప్రవాస భారతీయుల హక్కులు సంక్షేమ వేదిక కార్యాలయంలో జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో ఖతార్ నుండి సెలవులపై ఇండియాకు విచ్చేసిన “ తెలంగాణ గల్ఫ్ సమితి “ (TGS ) అధ్యక్షులు S. శంకర్ గౌడ్ మెట్ పల్లి డిమాండ్ చేశారు. ఖతార్ లో TGS ను స్థాపించి అక్కడి తెలంగాణ వాసులకు సేవ చేస్తున్న శంకర్ గౌడ్ గారు ఈరోజు ఆర్మూర్ కు ప్రత్యేకంగా విచ్చేసి కోటపాటి నరసింహం నాయుడు ను మర్యాద పూర్వకంగా కలిసిన సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు .
గల్ఫ్ దేశాలలో 10 లక్షలకు పైగా మన బిడ్డలు బతుకుదెరువు కోసం వెళ్లి అష్ట కష్టాలు పడుతున్నారు. వారిని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేరళ , ఆంధ్ర ప్రదేశ్ , తమిళనాడు, పంజాబ్ తరహాలో” గల్ఫ్ కార్మికుల సంక్షేమం” కోసం 500 కోట్లు కేటాయించి “ గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు ” చేస్తే అటు గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న కార్మికులకు ఇటు తిరిగి వచ్చిన వారికి మేలు జరుగుతుందని భావిస్తున్నామని తెలియజేశారు . అనేక రాష్ట్రాలలో NRI'S కొరకు వ్యవస్థలు ఉన్నాయి . తెలంగాణ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది . ఇటీవల తమిళనాడు ప్రభుత్వం 2021 సంవత్సరంలో NRI WELFARE Board For Tamil Nri's" ఏర్పాటు చేసి కోవిడ్ కారణంగా తిరిగి వచ్చిన వారికి 20 కోట్లు కేటాయించి ప్రతి ఒక్కరికి 2.50 లక్షల రుణం ఇచ్చి ఆదుకోంది చనిపోయిన కుటుంబాలకు రైతు బీమా మాదిరి 5 లక్షల ఎక్స్ గ్రేసియా ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు సమావేశంలో శంకర్ గౌడ్ తో పాటు కోటపాటి, ఊరే బాలయ్య న్యాయ సలహాదారుడు, జగిత్యాల బీసీ వెల్పేర్ అధ్యక్షుడు దిలీప్ పాల్గొన్నారు శంకర్ గౌడ్ ను కోటపాటి శాలువాతో సత్కరించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి ఖతార్)
తాజా వార్తలు
- కొత్త లేబర్ కోడ్ల అమలు
- దుబాయ్ ఎయిర్ షో: కుప్పకూలిన భారత్ కు చెందిన తేజస్ యుద్ధవిమానం
- తెలంగాణ: 25వ తేదీన క్యాబినెట్ భేటీ
- ఏపీ ప్రజలకు శుభవార్త..
- Dh5,000 సాలరీ పరిమితి ఎత్తివేత.. బ్యాంకులు రుణాలిస్తాయా?
- ఒమన్ లో మిలిటరీ పరేడ్ వీక్షించిన ది హానరబుల్ లేడీ..!!
- నకిలీ స్మార్ట్ఫోన్ల విక్రయం..ముగ్గురు ప్రవాసులు అరెస్టు..!!
- బహ్రెయిన్ వరుసగా రోడ్డు ప్రమాదాల పై ఆందోళన..!!
- పబ్లిక్ హెల్త్ ప్రమోషన్లో ప్రైవేట్ పాత్ర కీలకం..!!
- ఖతార్ లో NCD స్క్రీనింగ్ కేంద్రాలు పెంపు..!!







