దుబాయ్‌లో 100 అంతస్తుల 'హైపర్‌టవర్'.. ప్రపంచంలోనే ఎత్తైన నివాస భవనం

- November 23, 2022 , by Maagulf
దుబాయ్‌లో 100 అంతస్తుల \'హైపర్‌టవర్\'.. ప్రపంచంలోనే ఎత్తైన నివాస భవనం

దుబాయ్‌: దుబాయ్‌లోని కొత్త ఆకాశహర్మ్యం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నివాస భవనంగా రూపుదిద్దుకోనుంది. బుర్జ్ బింఘట్టి జాకబ్ & కో రెసిడెన్సెస్ అని పిలవబడే ఈ భవనం ఎమిరాటీ ప్రాపర్టీ డెవలప్‌మెంట్ కంపెనీ బింఘట్టి, వాచ్‌మేకర్ జాకబ్ & కోల సహకారంతో నిర్మించనున్నారు. ఈ భవనానికి సంబంధించిన డిజైన్‌లను తాజాగా ఆవిష్కరించారు. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన నివాస నిర్మాణాలలో ఒకటిగా ఇది నిలుస్తుందన్నారు. ఈ టవర్ 100 అంతస్తులను కలిగి ఉంటుందని పేర్కొన్నారు.  'హైపర్‌టవర్' మాన్‌హాటన్ ఆకాశహర్మ్యం 472 మీటర్ల ఎత్తును అధిగమిస్తుందని బింఘట్టి సీఈఓ ముహమ్మద్ బింఘట్టి తెలిపారు. ఈ భవనం దుబాయ్ ఆర్థిక జిల్లా గుండె అయిన బిజినెస్ బే నడిబొడ్డున ఉంటుందని వెల్లడించారు. పై అంతస్తులో ఐదు పెంట్‌హౌస్‌లు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. అయితే, భవనం ప్రారంభ తేదీని ఇంకా ప్రకటించలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com