'క్యాన్సర్' కారక సౌందర్య సాధనాలను నిషేధించిన కువైట్
- November 23, 2022
కువైట్: లిలియల్ అని పిలువబడే (బ్యూటిల్‌ఫెనైల్, మిథైల్‌ప్రొపియోనల్) సౌందర్య సాధనాలను దిగుమతి చేసుకోవడం, అమ్మడం, కొనుగోలు చేయడంపై నిషేధాన్ని విధిస్తున్నట్లు కువైట్ వాణిజ్యం, పరిశ్రమల మంత్రి మజెన్ అల్-నహెద్ వెల్లడించారు. యూరోపియన్ కెమికల్స్ ఏజెన్సీ (ECHA) ఈ పదార్ధాలను "క్యాన్సర్"గా జాబితాలో చేర్చిందన్నారు. ప్రస్తుతం స్థానిక మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వస్తువులను వెంటనే తొలగించాలని మంత్రిత్వ శాఖ సూచించింది. లిలియల్ అనేది ఒక రసాయన సమ్మేళనం. దీనిని సాధారణంగా సౌందర్య సాధనాలు, లాండ్రీ పౌడర్‌లలో పెర్ఫ్యూమ్‌గా ఉపయోగిస్తారు. ఇది సింథటిక్ సుగంధ ఆల్డిహైడ్. ఇది క్యాన్సర్, సంతానోత్పత్తికి హానికరం అని గుర్తించిన తర్వాత ఈ రకం సౌందర్య సాధనాలపై ఈయూ నిషేధం విధించింది.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్ షో: కుప్పకూలిన భారత్ కు చెందిన తేజస్ యుద్ధవిమానం
- తెలంగాణ: 25వ తేదీన క్యాబినెట్ భేటీ
- ఏపీ ప్రజలకు శుభవార్త..
- Dh5,000 సాలరీ పరిమితి ఎత్తివేత.. బ్యాంకులు రుణాలిస్తాయా?
- ఒమన్ లో మిలిటరీ పరేడ్ వీక్షించిన ది హానరబుల్ లేడీ..!!
- నకిలీ స్మార్ట్ఫోన్ల విక్రయం..ముగ్గురు ప్రవాసులు అరెస్టు..!!
- బహ్రెయిన్ వరుసగా రోడ్డు ప్రమాదాల పై ఆందోళన..!!
- పబ్లిక్ హెల్త్ ప్రమోషన్లో ప్రైవేట్ పాత్ర కీలకం..!!
- ఖతార్ లో NCD స్క్రీనింగ్ కేంద్రాలు పెంపు..!!
- మయన్మార్ చెర నుంచి 55 మందిని విడిపించిన ప్రభుత్వం







