అకౌంట్ అప్డేట్ పేరిట నగదు మాయం: ఐదుగురు స్కామ్ కాలర్ల ముఠా అరెస్ట్
- November 25, 2022
యూఏఈ: బ్యాంకు ఉద్యోగుల వలె నటించి నివాసితుల అకౌంట్ల నుంచి నగదు మాయం చేసిన ఐదుగురు వ్యక్తుల ముఠాను అరెస్ట్ చేసినట్లు షార్జా పోలీసులు తెలిపారు. షార్జా పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సిఐడి) డైరెక్టర్ కల్నల్ ఒమర్ అహ్మద్ బల్జోద్ కేసు వివరాలను వెల్లడించారు. స్కామర్‌లు యాదృచ్ఛికంగా కాల్‌లు చేసి, వారి బ్యాంక్ వివరాలను అప్‌డేట్ చేయాలని బాధితులకు చెబుతారని, వారు స్పందించకపోతే వారి ఖాతాలు స్తంభింపజేయబడతాయని భయపెడతారని పేర్కొన్నారు. ఇలా స్కామర్ల చేతిలో మోసపోయిన అనేక మంది తమకు ఫిర్యాదు చేశారని, అధికారులు విచారణ జరిపి స్కామ్ కాలర్‌లను గుర్తించినట్లు తెలిపారు. ముఠా ప్రధాన కార్యాలయంగా ఉపయోగిస్తున్న అపార్ట్‌మెంట్‌ను దర్యాప్తు బృందాలు గుర్తించాయని, అనంతరం ఫ్లాట్‌పై దాడి చేసి మోసానికి పాల్పడిన ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే నిందితులు ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు కల్నల్ బల్జోద్ తెలిపారు. నిందితులను అరెస్టు చేయడంతోపాటు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, కేసు పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు వెల్లడించారు. అనుమానాస్పద కాల్‌లను ఎప్పుడూ అటెండ్ చేయవద్దని, బ్యాంక్ వివరాలను లేదా వ్యక్తిగత డేటాను ఎవరితోనూ, ముఖ్యంగా ఆన్‌లైన్‌లో లేదా ఫోన్‌లో ఎప్పుడూ షేర్ చేయవద్దని కల్నల్ బల్జోద్ సూచించారు. తమ బ్యాంక్ ఖాతాకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని అప్‌డేట్ చేయాలనుకునే వారు ఫోన్ లో కాకుండా.. సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించాలన్నారు.
తాజా వార్తలు
- పోలీస్ కస్టడీకి ఐ-బొమ్మ రవి
- ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్...
- జనవరిలో వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రారంభం
- ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టుల మృతి
- మిస్సోరీలో NATS ఉచిత వైద్య శిబిరం
- దుబాయ్ లో నాలుగు రోజులపాటు సెలవులు..!!
- యూఎన్ గాజా పునర్నిర్మాణం.. బహ్రెయిన్ మద్దతు..!!
- కువైట్‌లో 50 ఇల్లీగల్ క్యాంప్స్ తొలగింపు..!!
- ఒమన్ లో ఖైదీలకు క్షమాభిక్ష..!!
- చైల్డ్ స్టే సేఫ్.. జర్నీ ఆఫ్ సేఫ్టీ గేమ్ ప్రారంభం..!!







