'అ.. ఆ..' ఈ చిత్ర షూటింగ్‌ ముగిసింది..

- April 24, 2016 , by Maagulf
'అ.. ఆ..' ఈ చిత్ర షూటింగ్‌ ముగిసింది..

 నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'అ.. ఆ..' ఈ చిత్ర షూటింగ్‌ ముగిసింది. ఈ విషయాన్ని నితిన్‌ సోషల్‌ మీడియా ద్వారా తెలియజేస్తూ చిత్ర బృందంతో కలిసి దిగిన ఫొటోని అభిమానులతో పంచుకున్నారు. అద్భుతమైన బృందమని.. వాళ్లందరినీ చాలా మిస్‌ అవుతున్నానంటూ పోస్ట్‌ చేశాడు. ఇప్పటికే ఈ చిత్ర టీజర్‌ విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. మాటల మాంత్రికుడిగా పేరు పొందిన త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకుల ఎదురుచూస్తున్నారు.నితిన్‌, సమంత ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం అ..ఆ( అనసూయ రామలింగం వర్సెస్‌ ఆనంద్‌ విహారి). హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రానికి ఎస్‌.రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరించారు. మిక్కీ జే మేయర్‌ సంగీత బాణీలు అందించారు. మే నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com