ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అమితాబ్ బచ్చన్
- November 25, 2022
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తన హక్కులను కాపాడాలంటూ ఈరోజు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పేరును, స్వరాన్ని, ఫొటోలను తన అనుమతి లేకుండా కౌన్ బనేగా కరోడ్ పతి పేరుతో నకిలీ లాటర్ స్కామ్, మరే ఇతర సంస్థ, వ్యక్తులు వాడుకోకుండా నిరోధించాలని, తన ప్రచార హక్కులను కాపాడాలని పిటిషన్ లో అమితాబ్ కోరారు. దీన్ని విచారించిన జస్టిస్ నవీన్ చావ్లా.. అమితాబ్ వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు.
అమితాబ్ అనుమతి లేదా ధ్రువీకరణ లేకుండా ఆయనకున్న సెలబ్రిటీ హోదాను వినియోగించుకోవడాన్ని జస్టిస్ చావ్లా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ కేసులో అమితాబ్ చెబుతున్నట్టు ప్రాథమిక ఆధారాలున్నాయని పేర్కొన్నారు. అమితాబ్ తరఫున ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. కేబీసీ లాటరీ లక్కీ డ్రా, కేబీసీ లాటరీ రిజిస్ట్రేషన్, అమితాబచ్చన్ వీడియో కాల్ తదతర రూపంలో ప్రచారం కోసం వినియోగిస్తున్న ఆధారాలను కోర్టుకు సమర్పించారు.
తాజా వార్తలు
- ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టుల మృతి
- మిస్సోరీలో NATS ఉచిత వైద్య శిబిరం
- దుబాయ్ లో నాలుగు రోజులపాటు సెలవులు..!!
- యూఎన్ గాజా పునర్నిర్మాణం.. బహ్రెయిన్ మద్దతు..!!
- కువైట్లో 50 ఇల్లీగల్ క్యాంప్స్ తొలగింపు..!!
- ఒమన్ లో ఖైదీలకు క్షమాభిక్ష..!!
- చైల్డ్ స్టే సేఫ్.. జర్నీ ఆఫ్ సేఫ్టీ గేమ్ ప్రారంభం..!!
- నాటోయేతర మిత్రదేశంగా సౌదీ.. ట్రంప్
- ఆస్ట్రేలియాలో BMW ప్రమాదం..8 నెలల గర్భిణితో ఉన్న భారతీయ మహిళ మృతి
- ఏపీలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు







