‘తోడేలు’: మూవీ రివ్యూ
- November 25, 2022
నటీనటులు: వరుణ్ ధావన్, కృతి సనన్, దీపక్ దొబ్రియాల్, అభిషేక్ బెనర్జీ, సౌరభ్ శుక్లా తదితరులు..
నిర్మాత: దినేష్ విజన్
దర్శకుడు: అమర్ కౌశిక్
సంగీతం: సచిన్ జిగార్
సినిమాటోగ్రఫీ: జిష్ణు భట్టాచార్య
ఎడిటర్: సంయుక్త కాజా
భాషతో సంబంధం లేకుండా ఇండియన్ సినిమాగా సినిమా చెలామణీ అవుతోంది. సౌత్ సినిమాలు నార్త్‌లో రిలీజ్ అవుతున్నాయ్. నార్త్ సినిమాలు సౌత్‌లోనూ రిలీజ్ అవుతున్నాయ్. కంటెంట్ బాగుంటే, మా సినిమా, మీ సినిమా అనే బేధం లేకుండా ఆదరించబడుతున్నాయ్. అలాంటిదే ‘తోడేలు’ సినిమా కూడా. హిందీలో ‘బేడియా’గా తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో ‘తోడేలు’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. యూనిక్ సబ్జెక్ట్ కావడంతో తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ దక్కే అవకాశాలున్నాయ్. డైరెక్ట్ తెలుగు సినిమాలా ‘తోడేలు’ను తెలుగులో బాగా ప్రమోట్ చేశారు కూడా. దాంతో విడుదలకు ముందే అంచనాలు క్రియేట్ చేసింది. మరి అంచనాల్ని అందుకోవడంలో ఈ సినిమా ఎన్ని మార్కులేయించుకుంటుందో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
ఢిల్లీకి చెందిన రోడ్డు కాంట్రాక్టర్ భాస్కర్ (వరుణ్ ధావన్), అరుణాచల్ ప్రదేశ్‌లోని ఓ మారుమూల ప్రాంతానికి రోడ్డు వేసే పని మీద అరుణాచల్ ప్రదేశ్ వస్తాడు. ఆ క్రమంలోనే తోడేలు కాటుకు గురవుతాడు. చికిత్స కోసం వెటర్నరీ డాక్టర్ అనైక (కృతిసనన్) వద్దకు వెళతాడు. ఆ తర్వాత నుంచి భాస్కర్ పగలు మనిషిగా, రాత్రి తోడేలుగా మారిపోతుంటాడు. తోడేలు రూపంలో రాత్రిపూట కొన్ని హత్యలు కూడా చేస్తుంటాడు. కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసుకుని మరీ ఎందుకు చంపుతాడు భాస్కర్.? అసలు తోడేలు కరిస్తే, ఓ మనిషి తోడేలుగా మారిపోవడానికి కారణమేంటీ.? అనేది తెలియాలంటే ‘తోడేలు’ సినిమా తెరపై చూడాల్సిందే.
నటీనటుల పని తీరు:
ఈ సినిమాకి వరుణ్ ధావన్ ప్రాణం పెట్టేశాడు. రెండు రకాల వేరియేషన్స్‌లో మంచి నటన కనబరిచాడు. డాక్టర్‌గా కృతి సనన్ గెటప్, నటన కొత్తగా వున్నాయ్. హీరో ఫ్రెండ్స్‌గా దీపక్, పాలిన్ తమ తమ డైలాగులూ, ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకుల్ని బాగా నవ్వించారు. మిగిలిన పాత్రధారులంతా తమ పరిధి మేర బాగానే నటించారు.
సాంకేతిక వర్గం పని తీరు:
కథ పాతదే అయినా కథనం నడిపించిన తీరు చాలా బాగుంది. ప్రకృతికి నష్టం వాటిల్లే సమయం వచ్చినప్పుడు స్వయానా ఆ భగవంతుడే జంతువుల రూపంలో వచ్చి దుష్ఠ శిక్షణ గావిస్తుంటాడు అదే ‘తోడేలు’ స్టోరీ లైన్. కానీ, డైరెక్టర్ కామిక్ వేలో కథను నడిపిన విధానం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. తోడేలుగా మారే క్రమంలో వరుణ్ ధావన్ చేసే విన్యాసాలు ఓ పక్క నవ్విస్తూనే మరోపక్క ఆయన కష్టం తెలిసేలా చేస్తాయి. టెక్నికల్‌గా సినిమా చాలా రిచ్‌గా కనిపించింది. అరుణాచల్ ప్రదేశ్ అందాలు విజువల్‌గా చాలా బాగున్నాయ్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కథకు సరిపోయింది. ఎడిటింగ్ విషయంలోనూ పెద్దగా తప్పులు దొర్లలేదు.
ప్లస్ పాయింట్స్:
కామిక్ వేలో తోడేలు కథను చెప్పడం..
అరుణాచల్ ప్రదేశ్ అందాలు విజువల్‌గా కనువిందు చేస్తాయ్..
క్లైమాక్స్ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్:
ఫస్టాప్‌లో కొన్ని సాగతీత అంశాలు
చివరిగా: ‘తోడేలు’ ఓ మంచి కామెడీ ఎంటర్‌టైనర్.. టైమ్ పాస్‌కి బాగానే వర్కవుట్ అవుతుంది.
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ ఫోర్జరీ.. వ్యక్తికి జైలు శిక్ష
- గ్రాండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వేడుక: విజేతలకు బహుమతుల అందజేత
- సౌదీలో గణనీయంగా పెరిగిన బీమాదారులు
- ఏడాదిలో 7,000 మంది ప్రవాసులు అరెస్ట్
- అజ్మాన్ లో ఇంధన ట్యాంక్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి
- యూఏఈ స్వచ్ఛంద చమురు ఉత్పత్తి కోత పొడిగింపు
- హైదరాబాద్‌లో భారీ వర్షం..
- తొమ్మిదేళ్ల పాలనలో కెసిఆర్ రూ. 5 లక్షల కోట్ల అప్పు చేశారు: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
- కొత్త బయోమెట్రిక్ కేంద్రాలు: ప్రవాసులకు రెండు, పౌరులకు మూడు
- భారత రైలు ప్రమాదంపై యూఏఈ అధ్యక్షుడు సంతాపం