హైదరాబాద్ విమానాశ్రయంలో అంతర్జాతీయ డిపార్చర్స్ టెర్మినల్ మార్పు
- November 25, 2022
హైదరాబాద్: మరింత మెరుగైన ప్రయాణం దిశగా, హైదరాబాద్ విమానాశ్రయంలో నూతన అంతర్జాతీయ డిపార్చర్ హాల్ 28 నవంబర్ 2022 నుండి పని చేయడం ప్రారంభిస్తుంది. కొత్తగా నిర్మించిన ఇంటర్నేషనల్ డిపార్చర్ హాల్ ప్రస్తుత టెర్మినల్‌తో అనుసంధానించబడింది. ప్రయాణికులకు ఈ మార్పు గురించి తెలియజేయమని ఎయిర్‌పోర్టు ఇప్పటికే విమానయాన సంస్థలను ఆదేశించింది. కొత్త డిపార్చర్ హాల్ నుండి బయలుదేరే మొదటి అంతర్జాతీయ విమానం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు SV 753 (సౌదీ ఎయిర్ లైన్స్). ఈ ఇంటర్నేషనల్ డిపార్చర్ హాల్ ప్రారంభంతో, ప్రస్తుతం ఉన్న ఇంటెరిమ్ ఇంటర్నేషనల్ డిపార్చర్ టెర్మినల్ (IIDT) మూసివేయబడుతుంది. నవంబర్ 28, మధ్యాహ్నం 1300 గంటల నుండి, అంతర్జాతీయ ప్రయాణీకులు ఇప్పుడు పాత IIDTకి వెళ్లే బదులు నేరుగా ప్రధాన టెర్మినల్ నుంచే వెళ్లవచ్చు.
ప్రయాణీకులు ఈ మార్పును గమనించి, ఏదైనా తదుపరి సమాచారం కోసం విమానాశ్రయ వెబ్‌సైట్ http://www.hyderabad.aero ను సందర్శించాలని లేదా విమానాశ్రయ సమాచార డెస్క్‌ను (+91-40-66546370) సంప్రదించాలని సూచించారు. విమానాశ్రయంలోని అన్ని ప్రధాన ప్యాసింజర్ టచ్ పాయింట్లలో ఈ సమాచారాన్ని అందించడానికి విమానాశ్రయం తగిన ఏర్పాట్లు చేసింది. విమానాశ్రయం యొక్క ఈ క్రింది సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా ఈ వివరాలను తెలియజేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ మొదటి విమానాశ్రయం.. మ్యూజియంగా ప్రారంభం
- ఇంటి ఓనర్ సౌకర్యాల వినియోగానికి అదనంగా వసూలు చేయవచ్చా?
- జింబాబ్వే ప్రైవేట్ విమాన ప్రమాదంలో భారతీయుడు మృతి
- 7 రోజుల్లో 11,465 మంది అరెస్ట్
- స్పెయిన్-ఒమన్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ ప్రారంభం
- అక్టోబర్ 2న అబుధాబిలో వాహనాల పై ఆంక్షలు
- విజయవాడ విద్యార్థులకు తానా స్కాలర్ షిప్ లు పంపిణీ...
- ఖతార్ లో ఘనంగా Mrs.CIA బ్రీఫింగ్ సెషన్
- ఫిలడెల్ఫియాలో ఘనంగా నాట్స్ ఆధ్వర్యంలో గణేశ్ ఉత్సవాలు
- అక్టోబర్ 07 వరకు రూ.2000 నోట్లు మార్పిడి చేసుకోవచ్చు