పోలీస్ ఉన్నతాధికారులు, ఎస్పీలతో టి.డీజీపీ మహేందర్రెడ్డి టెలీ కాన్ఫరెన్స్
- November 25, 2022
హైదరాబాద్: అటవీశాఖ, క్షేత్ర స్థాయి సిబ్బంది సమస్యలపై పోలీస్ ఉన్నతాధికారులు, ఎస్పీలతో డీజీపీ మహేందర్రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేవంలో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి డొబ్రియల్ పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో అటవీ అధికారులు, సిబ్బందికి మద్దతుగా నిలవాలని, భరోసా కల్పించాలని ఉన్నతాధికారులకు డీజీపీ ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం లాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని సూచించారు. తమ పరిధిలోని చీఫ్ కన్జర్వేటర్లు, జిల్లా అటవీ అధికారులతో.. స్వయంగా సమావేశం కావాలని పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశించారు. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని మహేందర్రెడ్డి తెలిపారు. అలాగే డీఎస్పీలు, సీఐలు, ఎస్.ఐలు కూడా తమ పరిధిలోని అటవీ అధికారులతో సమావేశం కావాలని ఆదేశించారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల రక్షణ, భద్రతకు ప్రాధాన్యతను ఇవ్వాలని పోలీస్ అధికారులను డీజీపీ మహేందర్ రెడ్డి కోరారు.
తాజా వార్తలు
- తెలంగాణలో చలి అలర్ట్
- పోలీస్ కస్టడీకి ఐ-బొమ్మ రవి
- ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్...
- జనవరిలో వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రారంభం
- ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టుల మృతి
- మిస్సోరీలో NATS ఉచిత వైద్య శిబిరం
- దుబాయ్ లో నాలుగు రోజులపాటు సెలవులు..!!
- యూఎన్ గాజా పునర్నిర్మాణం.. బహ్రెయిన్ మద్దతు..!!
- కువైట్లో 50 ఇల్లీగల్ క్యాంప్స్ తొలగింపు..!!
- ఒమన్ లో ఖైదీలకు క్షమాభిక్ష..!!







