ఆందోళన చేపట్టిన ఏపీ హైకోర్టు న్యాయవాదులు
- November 25, 2022
అమరావతి: ఏపీ హైకోర్టుకు చెందిన జడ్జిలను బదిలీ చేయడంపై హైకోర్టు న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డి.రమేశ్ లను బదిలీ చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. విధులను బహిష్కరించారు. ఉత్తరాది, దక్షిణాది న్యాయమూర్తుల పట్ల సుప్రీంకోర్టు కొలీజియం వివక్ష చూపుతోందని న్యాయవాదులు విమర్శించారు.
దేశంలని వివిధ హైకోర్టుల నుంచి ఏడుగురు జడ్జిలను ఇతర హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిన్న సిఫారసు చేసింది. వీరిలో ఏపీ హైకోర్టు, మద్రాస్ హైకోర్టుల నుంచి ఇద్దరు చొప్పున, తెలంగాణ హైకోర్టు నుంచి ముగ్గురు ఉన్నారు. జస్టిస్ దేవానంద్ ను మద్రాస్ హైకోర్టుకు, జస్టిస్ డి.రమేశ్ ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణలో చలి అలర్ట్
- పోలీస్ కస్టడీకి ఐ-బొమ్మ రవి
- ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్...
- జనవరిలో వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రారంభం
- ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టుల మృతి
- మిస్సోరీలో NATS ఉచిత వైద్య శిబిరం
- దుబాయ్ లో నాలుగు రోజులపాటు సెలవులు..!!
- యూఎన్ గాజా పునర్నిర్మాణం.. బహ్రెయిన్ మద్దతు..!!
- కువైట్లో 50 ఇల్లీగల్ క్యాంప్స్ తొలగింపు..!!
- ఒమన్ లో ఖైదీలకు క్షమాభిక్ష..!!







