ఆందోళన చేపట్టిన ఏపీ హైకోర్టు న్యాయవాదులు
- November 25, 2022అమరావతి: ఏపీ హైకోర్టుకు చెందిన జడ్జిలను బదిలీ చేయడంపై హైకోర్టు న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డి.రమేశ్ లను బదిలీ చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. విధులను బహిష్కరించారు. ఉత్తరాది, దక్షిణాది న్యాయమూర్తుల పట్ల సుప్రీంకోర్టు కొలీజియం వివక్ష చూపుతోందని న్యాయవాదులు విమర్శించారు.
దేశంలని వివిధ హైకోర్టుల నుంచి ఏడుగురు జడ్జిలను ఇతర హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిన్న సిఫారసు చేసింది. వీరిలో ఏపీ హైకోర్టు, మద్రాస్ హైకోర్టుల నుంచి ఇద్దరు చొప్పున, తెలంగాణ హైకోర్టు నుంచి ముగ్గురు ఉన్నారు. జస్టిస్ దేవానంద్ ను మద్రాస్ హైకోర్టుకు, జస్టిస్ డి.రమేశ్ ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు చేసింది.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!