జై బాలయ్య..! థమన్‌ని ఆడుకోవడం మొదలెట్టేశారుగా.!
- November 25, 2022
ఈ మధ్య థమన్ తన మ్యూజిక్‌తో పరువు తీసేస్తున్నాడు. అన్నీ కాపీ సాంగ్సే.. అంటూ రిలీజైన కాస్సేపటికే లీకు వీరులు పాత వీడియోలన్నింటినీ ఇన్‌ఫో తీసి సోషల్ మీడియాలో వదిలేస్తున్నారు.
ఈ పాట ఇదిగో ఈ సినిమాలోని సాంగ్‌ని కాపీ కొడితే వచ్చింది.. అంటూ ఆధారాలతో సహా వదిలేస్తుంటే.. ఏం చేయాలి నమ్మి తీరాల్సిందేగా. తాజాగా నందమూరి నటసింహం బాలయ్య నటించిన ‘వీర సింహారెడ్డి’ సినిమా నుంచి ‘జై బాలయ్య..’ అంటూ ఫస్ట్ సింగిల రిలీజ్ చేశారు.
ఈ పాట ఇలా రిలీజ్ చేశారో లేదో.. ఆ పాట ఇదిగో ఈ ఈ పాటలకి కాపీ మ్యూజిక్ అంటూ ‘ఒసేయ్ రాములమ్మ..’ పాటని రీమిక్స్ చేసి నెట్టింట్లో వదిలేశారు.
పాపం థమన్ ఎంత కష్టపడి వుంటాడోగా ఆ సాంగ్‌కి మ్యూజిక్ కంపోజ్ చేయడానికి. లీకు వీరులు కొన్ని నిముషాల్లోనే ఆ పాటకి మూలాలు కనిపెట్టేసి రీమిక్స్ చేసి వదిలేస్తున్నారు. అయినా థమన్‌కి ఈ మధ్య ఇలాంటి ట్రోల్స్ చాలా ఎక్కువయిపోతున్నాయ్. ఈజీగా టార్గెట్ అయిపోతున్నాడు. ఇది ఇలాగే కొనసాగితే, థమన్ ఇమేజ్ డ్యామేజ్ అయిపోవడానికి ఎంతో కాలం పట్టదు సుమీ.!
తాజా వార్తలు
- తెలంగాణలో చలి అలర్ట్
- పోలీస్ కస్టడీకి ఐ-బొమ్మ రవి
- ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్...
- జనవరిలో వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రారంభం
- ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టుల మృతి
- మిస్సోరీలో NATS ఉచిత వైద్య శిబిరం
- దుబాయ్ లో నాలుగు రోజులపాటు సెలవులు..!!
- యూఎన్ గాజా పునర్నిర్మాణం.. బహ్రెయిన్ మద్దతు..!!
- కువైట్‌లో 50 ఇల్లీగల్ క్యాంప్స్ తొలగింపు..!!
- ఒమన్ లో ఖైదీలకు క్షమాభిక్ష..!!







