జై బాలయ్య..! థమన్‌ని ఆడుకోవడం మొదలెట్టేశారుగా.!
- November 25, 2022ఈ మధ్య థమన్ తన మ్యూజిక్‌తో పరువు తీసేస్తున్నాడు. అన్నీ కాపీ సాంగ్సే.. అంటూ రిలీజైన కాస్సేపటికే లీకు వీరులు పాత వీడియోలన్నింటినీ ఇన్ఫో తీసి సోషల్ మీడియాలో వదిలేస్తున్నారు.
ఈ పాట ఇదిగో ఈ సినిమాలోని సాంగ్‌ని కాపీ కొడితే వచ్చింది.. అంటూ ఆధారాలతో సహా వదిలేస్తుంటే.. ఏం చేయాలి నమ్మి తీరాల్సిందేగా. తాజాగా నందమూరి నటసింహం బాలయ్య నటించిన ‘వీర సింహారెడ్డి’ సినిమా నుంచి ‘జై బాలయ్య..’ అంటూ ఫస్ట్ సింగిల రిలీజ్ చేశారు.
ఈ పాట ఇలా రిలీజ్ చేశారో లేదో.. ఆ పాట ఇదిగో ఈ ఈ పాటలకి కాపీ మ్యూజిక్ అంటూ ‘ఒసేయ్ రాములమ్మ..’ పాటని రీమిక్స్ చేసి నెట్టింట్లో వదిలేశారు.
పాపం థమన్ ఎంత కష్టపడి వుంటాడోగా ఆ సాంగ్‌కి మ్యూజిక్ కంపోజ్ చేయడానికి. లీకు వీరులు కొన్ని నిముషాల్లోనే ఆ పాటకి మూలాలు కనిపెట్టేసి రీమిక్స్ చేసి వదిలేస్తున్నారు. అయినా థమన్‌కి ఈ మధ్య ఇలాంటి ట్రోల్స్ చాలా ఎక్కువయిపోతున్నాయ్. ఈజీగా టార్గెట్ అయిపోతున్నాడు. ఇది ఇలాగే కొనసాగితే, థమన్ ఇమేజ్ డ్యామేజ్ అయిపోవడానికి ఎంతో కాలం పట్టదు సుమీ.!
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు