‘మారేడు మిల్లి ప్రజానీకం’: అల్లరోడు అంత సైలెంట్‌గా వున్నాడేంటీ.?
- November 25, 2022
అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం ‘ఇట్టు మారేడుమిల్లి ప్రజానీకం’. ఈ సినిమాకి సంబంధించి అప్పుడెప్పుడో ఓ టీజర్‌లాంటిది రిలీజ్ చేశారు. నితిన్ నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా రిలీజ్ టైమ్ అనుకుంటా.. ఆ టైమ్‌లో ఈ రెండు సినిమాలూ కాస్త ఒకే మాదిరి వున్నాయంటూ కామెంట్లు కూడా వచ్చాయ్.
నితిన్ ఆ మధ్యే తన ‘మాచర్ల ప్రజానీకం’ సినిమాతో వచ్చేశాడు, వచ్చీ వచ్చినట్లే వెళ్లిపోయాడు. కనీసం ఓటీటీ రైట్స్‌కి కూడా నోచుకోలేదు కాబోలు ఆ సినిమా. ఎప్పుడో ధియేటర్లో రిలీజైనా ఇప్పటి వరకూ ఓటీటీలో రాలేదు.
ఇక, తాజాగా అల్లరి నరేష్ ‘మారేడుమిల్లి నియోజకవర్గం’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అసలు ఇదో సినిమా వుందన్న సంగతి ప్రేక్షకులు మర్చిపోయారు. ఈ రోజు రిలీజ్ అనగా, నిన్న ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అది చూస్తే కానీ, ఈ సినిమా ఉనికి తెలియలేదు.
అస్సలు బజ్ లేదీ ఈ సినిమాకి. అల్లరి నరేష్ తన సినిమాలను బాగానే ప్రమోట్ చేసుకోగలడు కదా. అలాంటిది ఈ సినిమాని ఎందుకు లైట్ తీసుకున్నాడు. ఓ రేంజ్లో పబ్లిసిటీ చేస్తే కానీ, ఆ సినిమాని పెద్దగా పట్టించుకోవడం లేదు జనాలు. కొన్ని సార్లు మితిమీరిన పబ్లిసిటీ చేసినా లాభం లేకుండా పోతోంది. అలాంటిది మినిమమ్ పబ్లిసిటీ కూడా లేకుండా వచ్చేశాడు అల్లరి నరేష్. జనం ఎక్కడ పట్టించుకుంటారు సామీ.! అఫ్కోర్స్ సినిమాకి అంత సీనూ సినిమా కూడా లేదని తేల్చేశారు. ఆ విషయం నరేష్ ముందే కనిపెట్టేసి వుంటాడు కాబోలు.! అందుకే లైట్ తీసుకున్నాడేమో.
తాజా వార్తలు
- తెలంగాణలో చలి అలర్ట్
- పోలీస్ కస్టడీకి ఐ-బొమ్మ రవి
- ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్...
- జనవరిలో వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రారంభం
- ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టుల మృతి
- మిస్సోరీలో NATS ఉచిత వైద్య శిబిరం
- దుబాయ్ లో నాలుగు రోజులపాటు సెలవులు..!!
- యూఎన్ గాజా పునర్నిర్మాణం.. బహ్రెయిన్ మద్దతు..!!
- కువైట్‌లో 50 ఇల్లీగల్ క్యాంప్స్ తొలగింపు..!!
- ఒమన్ లో ఖైదీలకు క్షమాభిక్ష..!!







