సంక్రాంతి సందడి: శృతిహాసన్ ‘డబుల్’ ధమాకా.!
- November 25, 2022
ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది ముద్దుగుమ్మ శృతి హాసన్. అల్లు అర్జున్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్.. ఇలా స్టార్ హీరోలందరి సరసనా నటించేసింది. శృతి హాసన్ వుంటే ఆ సినిమా సూపర్ హిట్టే.. అనే టాక్ కూడా తెచ్చుకుంది.
అయితే, ప్రేమ, పెళ్లి.. అంటూ కొన్నాళ్లు కెరీర్‌ని చేతులారా పాడు చేసుకుంది. దాంతో శృతి హాసన్ పనైపోయిందనుకున్నారంతా. దాదాపు ఆమెని పక్కన పెట్టేశారు కూడా.
ఈ మధ్యనే రవితేజ ‘క్రాక్’తో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది శృతి హాసన్. మొదట్లో స్లోగా స్టార్ట్ అయిన శృతి హాసన్ కెరీర్ ఇప్పుడు పుంజుకుంది. సీనియర్ స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటోంది. అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ శృతి హాసన్ జెట్ స్పీడుతో దూసుకెళుతోంది.
తెలుగు విషయానికి వస్తే, ఈ సంక్రాంతి సందడి అంతా శృతి హాసన్‌దే అని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’, నందమూరి నటసింహం బాలయ్య ‘వీర సింహారెడ్డి’.. అంటూ రెండు పెద్ద సినిమాలతో పెద్ద హీరోల సినిమాలతో వస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో శృతి హాసన్‌కి ఇది బెస్ట్ అచీవ్‌మెంట్ అని చెప్పక తప్పదు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







