ట్రాఫిక్ జరిమానా 50% తగ్గింపు: సేవా కేంద్రాల వర్కింగ్ అవర్స్ పొడిగింపు
- November 25, 2022
యూఏఈ: ట్రాఫిక్ జరిమానాలపై వాహనదారులకు 50 శాతం తగ్గింపును పొందేందుకు అజ్మాన్ పోలీసులు ట్రాఫిక్, పెట్రోల్ సర్వీసెస్ సెంటర్‌లో పని గంటలను పొడిగించారు. ఇకపై ఈ కేంద్రం సోమవారం నుండి గురువారం వరకు ఉదయం 7.30 నుండి రాత్రి 10 గంటల వరకు.. శుక్రవారాల్లో ఉదయం 7.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది శని, ఆదివారాల్లో సేవా కేంద్రం మూసివేయబడుతుంది. నవంబర్ 21 నుండి అమలులోకి వచ్చిన తగ్గింపు పథకం 2023 జనవరి 6 వరకు ఉంటుంది. ట్రాఫిక్ జరిమానాలను సేవా కేంద్రాలు, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ లేదా అజ్మాన్ పోలీస్ యాప్‌లు, సాహ్ల్ స్మార్ట్ కియోస్క్‌ల ద్వారా చెల్లించవచ్చు. ఉమ్ అల్ క్వైన్, ఫుజైరాలోని పోలీసు బలగాలు కూడా ట్రాఫిక్ జరిమానాలపై ఇలాంటి తగ్గింపు పథకాలను ప్రకటించాయి.
తాజా వార్తలు
- తెలంగాణలో చలి అలర్ట్
- పోలీస్ కస్టడీకి ఐ-బొమ్మ రవి
- ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్...
- జనవరిలో వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రారంభం
- ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టుల మృతి
- మిస్సోరీలో NATS ఉచిత వైద్య శిబిరం
- దుబాయ్ లో నాలుగు రోజులపాటు సెలవులు..!!
- యూఎన్ గాజా పునర్నిర్మాణం.. బహ్రెయిన్ మద్దతు..!!
- కువైట్లో 50 ఇల్లీగల్ క్యాంప్స్ తొలగింపు..!!
- ఒమన్ లో ఖైదీలకు క్షమాభిక్ష..!!







