స్త్రీ హింసా వ్యతిరేక దినం

- November 25, 2022 , by Maagulf
స్త్రీ హింసా వ్యతిరేక దినం

అంశం :  స్త్రీ హింసా వ్యతిరేక దినం
శీర్షిక :  ఎన్నాళ్ళు??ఎన్నేళ్ళు??

సమాజమా కాదా అవును సమాజమే 
నీవు నిర్మించిన అందమైన సమాజము 
కోల్పోతున్నారు మానవీయవిలువలు
పసిపిల్లల పై ఆగని ఆఘాయిత్యాలు 
అత్తింటి ఆరళ్ళు లైంగిక వేధింపులు
చుట్టుజరిగే లెక్కలేనన్ని అన్యాయాలు,అవమానాలు ...

గర్భంలోనే మొదలయ్యే వివక్షతలు 
పుట్టిననాటి నుంచి కాటివరకు హింసలు
ఆచారాల పేరిట చేసే బాల్యవివాహాలు
చీకటిమాటున నిర్భంధ గృహాహింసలు ...

మగువలపై ఆగలేదు దుశ్చర్యలు
వెంటాడి,వేధించి చేసేరు ఆమ్లదాడులు 
ఎన్నెన్ని దారుణాలు జరుగుతున్నా-
వినపడలేదు ఎవ్వరికీ-
జీరగా మారిన నీ గొంతుక ఘోషలు
హృదయ ఆక్రందనలు .....

ఎటుపోతున్నాయి చుట్టపు చట్టాలు??
నేర్చుకోమనేరు ఆత్మరక్షణ విద్యలు 
గొంతెత్తి చేసేరు హక్కులకై నినాదాలు
అయినా- 
ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు మహిళలు 
భయంగుప్పిట బతికీడుస్తున్నారు చిన్నారులు..

ఎన్నాళ్ళు?? ఎన్నేళ్ళు??
 ఇంకిపోయాయి కన్నీళ్ళు
ఆపలేమా ఈ హింసని?? వేయలేమా అడ్డుకట్ట??
ముక్కుపచ్చలారని కుసుమాలని 
కబంధహస్తాల నుంచి కాపాడుకుందాం!! 
ప్రేమతో పలకరించి, ఆదరిద్దాం!! 
హింసలేని 
సమసమాజం కోసం పాటుపడదాం......
ఆడపిల్లలని బతకనిద్దాం!! 
------‐
--యామిని కోళ్ళూరు,అబుధాభి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com