వర్క్ పర్మిట్‌ల సస్పెన్షన్: యూఏఈలో కొత్త నిబంధనలు
- November 26, 2022
యూఏఈ: కంపెనీలకు కొత్త వర్క్ పర్మిట్‌లను నిలిపివేయడానికి దారితీసే నాలుగు రకాల ఉల్లంఘనల గురించి యూఏఈ మానవ వనరులు, ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) వెల్లడించింది. కొత్తగా ప్రకటించిన తీర్మానంలో ఈ నాలుగు ఉల్లంఘనల గురించి నిర్వచించబడ్డాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఆ నాలుగు రకాల ఉల్లంఘనలు:
1. మంత్రిత్వ శాఖ సవరణల ద్వారా సేవా రుసుములు, అడ్మినిస్ట్రేటివ్ జరిమానాలకు సంబంధించి 2020 క్యాబినెట్ రిజల్యూషన్ నం. 21లో నిర్దేశించిన ఉల్లంఘనలు.
2. తగిన కార్మిక వసతి కల్పించడంలో వైఫల్యం. ఉద్యోగులకు అవసరమైన వసతి కల్పించే వరకు కంపెనీ ఫైల్ అడ్మినిస్ట్రేటివ్‌గా నిలిపివేయబడుతుంది.
3. మానవ అక్రమ రవాణా ఆరోపణలు., ఉల్లంఘించిన సంస్థ నిర్దోషి అని నిరూపించబడే వరకు సస్పెండ్ చేయబడుతుంది. దోషిగా తేలితే కంపెనీకి వ్యతిరేకంగా తుది తీర్పు వెలువడిన తర్వాత సస్పెన్షన్ రెండేళ్లపాటు కొనసాగుతుంది.
4. మంత్రిత్వ శాఖ వ్యవస్థలను యాక్సెస్ చేయడానికి కంపెనీకి మంజూరు చేయబడిన ఎలక్ట్రానిక్ అధికారాల దుర్వినియోగం. ఈ సందర్భంలో కంపెనీ ఫైల్ నిరూపితమైన ఉల్లంఘన తేదీ నుండి ఆరు నెలల కాలానికి పరిపాలనాపరంగా నిలిపివేయబడుతుందని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







