'ఒపేరా' బ్రౌజర్‌లో ఉచిత వీపీఎస్ సేవలు
- April 24, 2016
పబ్లిక్ వైఫై వాడుతున్నప్పుడు హ్యాకర్లు సులువుగా దాడులకు పాల్పడే ప్రమాదం ఉంది. పబ్లిక్ వైఫైను కూడా భద్రంగా వాడుకోవాలంటే.. బ్రౌజర్‌లో వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్(వీపీఎన్) ఎక్స్‌టెన్షన్లను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. వీపీఎన్ సేవల కోసం డబ్బులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. అలాంటి ఇబ్బందులు లేకుండా 'ఒపేరా' బ్రౌజర్‌లో ఉచిత వీపీఎస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వినియోగదారులకు పూర్తి భద్రత కల్పించేందుకు తమ కొత్త వెర్షన్ బ్రౌజర్‌లో వీపీఎన్‌ను ఇన్‌బిల్ట్‌గా పొందుపరిచినట్లు ఒపేరా సంస్థ వెల్లడించింది.తాజా డెస్క్‌టాప్ వెర్షన్ ఒపేరా బ్రౌజర్‌లో ఈ సదుపాయం ఉంది. ఇకనుంచి థర్డ్‌పార్టీ సంస్థల నుంచి వీపీఎస్ సేవలను సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సిన పనిలేదు. ఒపేరా బ్రౌజర్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి వీపీఎన్‌ను ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ సర్వీసులతో ఇక పబ్లిక్ వైఫైతోనూ భద్రంగా బ్రౌజ్ చేసుకోవచ్చని ఒపేరా సంస్థ చెబుతోంది. ఉచితంగా.. ఇన్‌బిల్ట్‌గా వీపీఎస్ సేవలను అందిస్తున్న తొలి బ్రౌజర్ ఒపేరానే.
వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్(వీపీఎన్)తో ప్రయోజనాలు
* మనం వాడుతున్న కంప్యూటర్ వివరాలన్నీ పూర్తిగా ఎన్‌క్రిప్ట్ అవుతాయి.
* మన కంప్యూటర్ ఐపీ అడ్రస్‌ను ఇతరులు తెలుసుకునే వీలుండదు
* మనం బ్రౌజింగ్ చేస్తున్న వివరాలను మరెవ్వరూ ట్రాక్ చేసే అవకాశం ఉండదు
* కుకీలు బ్లాక్ అయిపోతాయి
* ఫైర్‌వాల్ సెక్యూరిటీ మెరుగుపడుంది
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







