కారు కొనుగోలుదారులకు ఎస్బీఐ శుభవార్త!
- November 27, 2022భారత్ లో దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కారు కొనుగోలుదారులకు తీపికబురు అంచింది.అదిరే ఆఫర్లు అందుబాటులో ఉంచింది. పలు రకాల ప్రయోజనాలు కల్పిస్తోంది. దీంతో లోన్ తీసుకొని కారు కొనే వారికి ప్రయోజనం కలుగనుంది. కారు కొనేందుకు ఎస్బీఐ తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తోంది. వడ్డీ రేటు 8.4 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. క్రెడిట్ స్కోర్ ప్రాతిపదికన లోన్ వడ్డీ రేటు మారొచ్చు. అంతేకాకుండా ఈ లోన్ పొదడం వల్ల ఏడు ఏళ్ల వరకు ఈఎంఐ పెట్టుకోవచ్చు. దీని వల్ల నెలవారీ ఈఎంఐ తగ్గుతుంది. కానీ వడ్డీ మొత్తం పెరుగుతుంది. అలాగే కారు ధరలో 90 శాతం మొత్తాన్ని ఫైనాన్స్ రూపంలో పొందొచ్చు.
అంతేకాకుండా ఎస్బీఐ కారు లోన్‌పై జీరో ప్రిపేమెంట్ పెనాల్టీ బెనిఫిట్ ఉంది. ఇంకా ఫోర్ క్లోజర్ చార్జిలు కూడా ఉండవు. ఏడాది తర్వాతనే ఈ బెనిఫిట్ పొందొచ్చు. ఇంకా జీరో ప్రాసెసింగ్ ఫీజు ప్రయోజనం లభిస్తోంది. అంటే మూడు రకాల బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా కారు లోన్ కోసం అప్లై చేసుకుంటేనే ఈ ప్రయోజనాలు లభిస్తాయి.
అంతేకాకుండా కొత్త కారు కొనుగోలు చేయాలని భావించే వారికి నవంబర్ నెలలో పలు రకాల ఆఫర్లు కూడా ఉన్నాయి. ఏకంగా రూ. 2 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. కారు, మోడల్, డీలర్ షిప్ ప్రాతిపదికన కారు ఆఫర్లో మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు. అందువల్ల కారు కొనే వారు ఈ ప్రయోజనం కూడా సొంతం చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ