బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..

- November 27, 2022 , by Maagulf
బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..

ముంబై: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్. నవంబర్ నెల దాదాపు అయిపోవచ్చింది.డిసెంబర్ నెల ప్రారంభం కానుంది. మరి డిసెంబర్ లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో తెలుసా? ఏయే రోజుల్లో బ్యాంకులు మూసి ఉంచుతారో తెలుసా? ఈ విషయాలు తెలుసుకోకపోతే.. బ్యాంకులో ఏవైనా ముఖ్యమైన పనులంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు, ఏయే రోజుల్లో బ్యాంకులు మూసి ఉంచుతారో తెలుసుకుంటే అందుకు అనుగుణంగా పనులను షెడ్యూల్ చేసుకోవచ్చు.

ఏ రోజుల్లో బ్యాంకులు మూతపడతాయో అనే జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) జారీ చేస్తుంది. RBI జాబితా ప్రకారం.. డిసెంబర్ నెలలో 13 రోజులు బ్యాంకులు పని చేయవు. వాటిల్లో వీకెండ్ సెలవులు 6 ఉన్నాయి. నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం సెలవులు. మిగిలినవి ఆయా రాష్ట్రాల్లో నిర్దేశిత బ్యాంకులకు మాత్రమే సెలవు. బ్యాంకు లావాదేవీలు జరిపే వారు ఈ డేట్స్ చెక్ చేసుకుని తమ పనులు ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. లేదంటే ఇబ్బందులు తప్పవు.

డిసెంబర్ 3‌,12,19,26, 29,30,31 తేదీల్లో బ్యాంకుల‌కు సెల‌వులు ఉన్నాయి. 4,10,11,18,24,25 తేదీల్లో ఆదివారాలు, రెండో శ‌నివారం, నాలుగో శ‌నివారం సంద‌ర్భంగా బ్యాంకులు ప‌ని చేయ‌వు. మొత్తం బ్యాంకు సెలవులు 13 అవుతాయి. కాగా, బ్యాంకు సెలవులు దేశం మొత్తం ఒకేలా ఉండవు. ఆయా రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి. ఆ రాష్ట్రాల్లో జరుపుకునే పండుగలపైనా హాలిడేస్ అనేది ఆధారపడి ఉంటుంది.

ఇకపోతే.. బ్యాంకు శాఖ మూతపడినప్పటికీ ఇంట్లో కూర్చొని బ్యాంకింగ్ సంబంధిత పనులు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ బ్యాంకింగ్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ATM సేవలు కూడా పనిచేస్తాయని బ్యాంకు వర్గాలు తెలిపాయి.

డిసెంబర్‌లో బ్యాంకు సెలవులు:

డిసెంబర్ 3 – శనివారం-సెయింట్ జేవియర్స్ ఫీస్ట్ (గోవాలో బ్యాంకులకు సెలవు)

డిసెంబర్ 4 – ఆదివారం

డిసెంబర్ 10 – రెండో శనివారం

డిసెంబర్ 11 – ఆదివారం

డిసెంబర్ 12 – సోమవారం – పా -టాగన్ నెంగ్మింజ సంగం (మేఘాలయలో బ్యాంకులకు సెలవు)

డిసెంబర్ 18 – ఆదివారం

డిసెంబర్ 19 – సోమవారం – గోవా విమోచన దినం (గోవాలో బ్యాంకులకు సెలవు)

డిసెంబర్ 24 – నాలుగో శనివారం

డిసెంబర్ 25 – ఆదివారం

డిసెంబర్ 26 – సోమవారం – లాసంగ్, నమ్సంగ్ (మిజోరం, సిక్కిం, మేఘాలయలో బ్యాంకులకు సెలవు)

డిసెంబర్ 29 – గురువారం – గురు గోవింద్ సింగ్ జి పుట్టిన రోజు (చండీగఢ్‌లో బ్యాంకులకు సెలవు)

డిసెంబర్ 30 – శుక్రవారం – యు కియాంగ్ నంగ్వా (మేఘాలయలో బ్యాంకులకు సెలవు)

డిసెంబర్ 31 – శనివారం – నూతన సంవత్సర వేడుకలు (మిజోరంలో బ్యాంకులకు సెలవు)

వీకెండ్ సెలవులు..

డిసెంబర్ 4-ఆదివారం
డిసెంబర్ 10-ఆదివారం
డిసెంబర్ 11-ఆదివారం
డిసెంబర్ 18-ఆదివారం
డిసెంబర్ 24-రెండో శనివారం
డిసెంబర్ 25-క్రిస్ మస్, ఆదివారం

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com