ఒమన్ లో 9 నెలలపాటు రొయ్యల వేటపై నిషేధం
- November 28, 2022
మస్కట్: తొమ్మిది నెలలపాటు రొయ్యల వేట, వ్యాపారంపై నిషేధం విధించినట్లు ఒమన్ వ్యవసాయ, మత్స్య, జలవనరుల మంత్రిత్వ శాఖ (MAFWR) ప్రకటించింది. డిసెంబర్ 1 నుంచి నిషేధపు అంక్షలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ ఏడాది నవంబర్ 30న సుల్తానేట్‌లో రొయ్యల చేపలు పట్టే సీజన్ ముగుస్తుందని, డిసెంబర్ 1 నుంచి ఆగస్టు వరకు ఫలదీకరణం, పునరుత్పత్తి, సహజ వృద్ధి కాలంలో రొయ్యల చేపలు పట్టడం, వ్యాపారం చేయడంపై నిషేధం విధిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మత్స్యకారులు, చేపల రవాణాదారులు, కంపెనీలు, సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు తమ దగ్గర ఉన్న రొయ్యల స్టాక్ ను నమోదు చేసుకోవాలని మంత్రిత్వ శాఖ కోరింది. నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి గరిష్టంగా RO5,000 జరిమానా లేదా మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా రెండు శిక్షలు ఏకకాలంలో విధించే అవకాశం ఉందన్నారు. దీనితోపాటు ఫిషింగ్ లైసెన్స్‌ను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా రద్దు చేయొచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







