ఈనాడు-ఈటీవీ సంయుక్తంగా ఇంకుడు గుంతల తవ్వకo..

- April 24, 2016 , by Maagulf
ఈనాడు-ఈటీవీ సంయుక్తంగా ఇంకుడు గుంతల తవ్వకo..

జల సంరక్షణ కోసం ఈనాడు-ఈటీవీ సంయుక్తంగా ఇంకుడు గుంతల తవ్వకాన్ని ప్రజా ఉద్యమంగా చేపట్టడం ఎంతో అభినందనీయమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. పుట్టపర్తి పట్టణంలో ఈనాడు-ఈటీవీ చేపట్టిన ఇంకుడు గుంతల కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్‌, పల్లె రఘునాథ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రతి నీటిబొట్టును నిల్వ చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్రతి ఇంటా ఇంకుడు గుంతలు తవ్వుకోవాలని కోరారు. ఈనాడు ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్‌, సుజలాం-సుఫలాం లాంటి సామాజిక కార్యక్రమాలు రామోజీరావు చేపట్టడం ఎంతో హర్షనీయమని కొనియాడారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com