రైలు ఢీకొని ముగ్గురు చిన్నారులు దుర్మరణం
- November 28, 2022
పంజాబ్: పంజాబ్‌లోని కిరత్‌పూర్ సాహిబ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందారు.రైలు పట్టాలపై కూర్చుని పండ్లు తింటున్న చిన్నారులను ట్రైన్ ఢీకొట్టింది.దీంతో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
సట్లేజ్ నదిపై ఉన్న లొహంద్ రైల్వే బ్రిడ్జి సమీపంలో నలుగురు చిన్నారులు చెట్లకు ఉన్న పండ్ల తెంపుకున్నారు. అనంతరం రైల్వే పట్టాలపై కూర్చుకుని వాటిని తింటున్నారు. అదే సమయంలో సహరాన్‌పూర్ నుంచి హిమాచల్ ప్రదేశ్ వెళ్తున్న రైలు అటుగా వచ్చింది. దానిని గమనించకుండానే ఆ చిన్నారులు పండ్లను తింటూ ఉండిపోయారు.
దీంతో రైలు వారిని ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. మరొక చిన్నారికి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- గిన్నిస్ రికార్డుకు సిద్ధమవుతున్న అయోధ్య!
- కువైట్ లో ది లీడర్స్ కాన్క్లేవ్..!!
- సౌదీలో 23,094 మంది అరెస్టు..!!
- బహ్రెయిన్ లో మెసేజ్ స్కామ్స్ పెరుగుదల..!!
- ప్రపంచ శాంతికి ఖతార్ కృషి..!!
- బర్నింగ్ డాల్ ట్రెండ్ పై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- ROHM లో స్టార్ డయానా హద్దాద్ కాన్సర్ట్..!!
- దోహా చర్చలతో పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ శాంతి ఒప్పందం
- శంకర నేత్రాలయ USA తమ 'అడాప్ట్-ఎ-విలేజ్' దాతలకు అందిస్తున్న ఘన సత్కారం
- నవంబర్ 14, 15న సీఐఐ భాగస్వామ్య సదస్సు–ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు సమీక్ష