భారతీయ విద్యార్థుల కోసం కువైట్‌లో హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్
- November 28, 2022
కువైట్: భారతీయ విద్యార్థుల కోసం హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2022ని నిర్వహిస్తున్నట్లు ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ వెల్లడించింది. ఈ ఫెయిర్ డిసెంబర్ 8-10 తేదీల్లో ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు సల్మియా ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ బ్రాంచ్‌లో జరుగుతుందన్ని పేర్కొంది. భారతదేశం, విదేశాలలో ఉన్నత విద్య కోసం అడ్మిషన్లు కోరుకునే తల్లిదండ్రులు, విద్యార్థులకు ఈ ఫెయిర్ మంచి అవకాశాన్ని ఇస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రసిద్ధ వ్యాపార పాఠశాలలు, వైద్య , ఇంజనీరింగ్ కళాశాలలు, భారతదేశం & విదేశాలలోని విశ్వవిద్యాలయాల నుండి ప్రతినిధులు అందుబాటులో ఉన్న తాజా విద్యా అవకాశాల గురించి ఫెయిర్‌లో అవగాహన కల్పిస్తారన్నారు. ఈవెంట్‌కు ప్లాటినం స్పాన్సర్‌లుగా మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (MAHE), జైన్ యూనివర్సిటీ, గోల్డ్ స్పాన్సర్‌లు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ, SRM ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, MIT- వరల్డ్ పీస్ యూనివర్సిటీ, రాజలక్ష్మి ఇంజినీరింగ్ కాలేజ్, డి మోంట్‌ఫోర్ట్ విశ్వవిద్యాలయం, బిట్స్ పిలానీ - దుబాయ్ క్యాంపస్ వ్యవహారిస్తుండగా.. అసోసియేట్ స్పాన్సర్లు ఆచార్య ఇన్స్టిట్యూట్, B.M.S. కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, REVA యూనివర్సిటీ, PSGR కృష్ణమ్మాళ్ కాలేజ్ ఫర్ ఉమెన్, మహీంద్రా యూనివర్సిటీ, మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, దుబాయ్, SP జైన్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్‌మెంట్, మిడిల్‌సెక్స్ యూనివర్శిటీ, అల్గోన్‌క్విన్ కాలేజ్, IDP ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్స్, అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ కువైట్ (AUK) ఉన్నాయి. ఫెయిర్ కోసం ఎంట్రీని ముందస్తుగా నమోదు చేసుకోవడం ద్వారా ఐప్యాడ్‌ను గెలుచుకునే ప్రత్యేక అవకాశాన్ని కూడా అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- గిన్నిస్ రికార్డుకు సిద్ధమవుతున్న అయోధ్య!
- కువైట్ లో ది లీడర్స్ కాన్క్లేవ్..!!
- సౌదీలో 23,094 మంది అరెస్టు..!!
- బహ్రెయిన్ లో మెసేజ్ స్కామ్స్ పెరుగుదల..!!
- ప్రపంచ శాంతికి ఖతార్ కృషి..!!
- బర్నింగ్ డాల్ ట్రెండ్ పై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- ROHM లో స్టార్ డయానా హద్దాద్ కాన్సర్ట్..!!
- దోహా చర్చలతో పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ శాంతి ఒప్పందం
- శంకర నేత్రాలయ USA తమ 'అడాప్ట్-ఎ-విలేజ్' దాతలకు అందిస్తున్న ఘన సత్కారం
- నవంబర్ 14, 15న సీఐఐ భాగస్వామ్య సదస్సు–ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు సమీక్ష