ఫిఫా (FIFA) చరిత్రలో మొట్టమొదటి తెలుగు పాట
- November 28, 2022
దోహా: ఫుట్బాల్ (FIFA) చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా తెలుగు పాటతో "ఫిఫా 2022" నిర్వహిస్తున్న ఆతిధ్య ఖతార్ దేశానికి కృతజ్ఞతాపూర్వకంగా ఆంధ్ర కళావేదిక ఖతార్ వారు శుభోదయం గ్రూప్ సహకారంతో తెలుగు పాటను విడుదల చేశారు.
పలువురు సినీ, క్రీడా, వ్యాపార ప్రముఖులు మరియు దేశ విదేశాలలోని తెలుగు సంఘాల అధినేతలు వారి కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శుభోదయం గ్రూప్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ లయన్ Dr.లక్ష్మి ప్రసాద్ కలపటపు, తనికెళ్ల భరణి గారు, సాయి కుమార్, తనికెళ్ల శంకర్, విక్టర్ అమల్రాజ్, TANA అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, TANA కల్చరల్ సర్వీస్ కో-ఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల, వీధి అరుగు నార్వే అధ్యక్షులు వెంకట్ తరిగోపుల, శ్రీ సాంస్కృతిక కళా సారధి సింగపూర్ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, మలేషియా తెలుగు సంఘం నుంచి సత్య మల్లుల, హాంగ్ కాంగ్ నుంచి జయ పీసపాటి, నైజీరియా తెలుగు సంఘం నుంచి ప్రవీణ్, తెలుగు సంఘాల ఐక్య వేదిక కువైట్ అధ్యక్షులు కుదరవల్లి సుధాకర్, సౌదీ తెలుగు అసోసియేషన్ అధ్యక్షురాలు దీపికా రావి, తెలుగు కళా సమితి ఒమన్ కన్వీనర్ అనిల్ కుమార్, తెలుగు కళా సమితి బహరేన్ శివ యెల్లపు, ఎం.బి.రెడ్డి, కువైట్ నుంచి లలిత ధూళిపాళ , అఖిలభారత తెలుగు సేన నుంచి PSN మూర్తి, ప్రయాగ శర్మ, విజయభాస్కర్ దీర్ఘాశి , జిజ్ఞాస భార్గవ్ , శివ శంకర్, S4J ఛానల్ అధినేత సురేష్ బాసంగి , క్రీడాకారుడు కార్తీక్ యనమండ్ర, ఖతార్ నుంచి ఇండియన్ కల్చరల్ సెంటర్ (ICC) సలహా మండలి ఛైర్మన్ KS ప్రసాద్, జనరల్ సెక్రటరీ కృష్ణకుమార్, ఆంధ్ర కళా వేదిక సలహా మండలి ఛైర్మన్ సత్యనారాయణ మలిరెడ్డి, గొట్టిపాటి రమణయ్య , దోహా మ్యూజిక్ లవర్స్ గ్రూప్ ఫౌండర్ సయెద్ రఫీ, ప్రసాద్ ఇంద్రగంటి, శుభోదయం మీడియా సీఈఓ సూర్యప్రకాశ్, ఇలా పలువురు మాట్లాడుతూ తెలుగు వారి గౌరవాన్ని ఖండాతరాలు వ్యాపింపచేసేలా చేసే ఇంతటి అద్భుతమైన ఆలోచనకు, రూపకల్పనకు, దాన్ని అమలుచేసి నిర్వహించినందుకు ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ బృందాన్ని పలు మార్లు కొనియాడారు.
ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ప్రముఖుల రాకతో మరింత వన్నె వచ్చిందని. తమ కార్యవర్గం అతి తక్కువ (10 రోజుల) వ్యవధిలో ఇంతటి బృహత్కార్యానికి పూనుకొని అరుదైన రికార్డు సృష్టించడంలో కృతకృత్యులు అయ్యాయని తెలియజేసారు.ఈ పాట చిత్రీకరణలో ఫిఫా 2022 నిర్వహించే 8 స్టేడియంలు, ఖతార్ లోని చారిత్రాత్మక మరియు ప్రముఖ కట్టడాలు, అరబ్ దేశాల ఆచార వ్యవహారాలు ప్రతిబింబించే సన్నివేశాలు చిత్రీకరించామని తెలియజేసారు.
ఇంతటి ఘనతను సాధించటానికి సహకరించిన ప్రాయోజితులు శుభోదయం గ్రూప్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ లయన్ Dr.లక్ష్మి ప్రసాద్ కలపటపు కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.అలాగే ఈ పాటకు ఎంతో అద్భుతమైన సాహిత్యాన్ని ప్రత్యేకించి అరబీ భాష (హయ్య-హయ్య, హాబీబి) పదాలను అందించిన తనికెళ్ల శంకర్, దానికి తిగనట్టు అంతే అద్వితీయమైన బాణీ/సంగీతాన్ని సమకూర్చిన మాధవపెద్ది సురేష్ కి, తమ అద్భుతమైన గాత్రంతో పాటకు మరింత వన్నె తెచ్చిన S.P. చరణ్, హరిణి కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
అంతేకాక ఈ పాట చిత్రీకరణకు మరియు ఎడిటింగ్ కు తమ సహకారాన్ని అందించిన జగదీశ్ అల్లం మరియు గోవర్ధన్ అమూరు కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.అలాగే పాట చిత్రీకరణలో ముఖ్య భూమిక నిర్వహించిన విక్రమ్ సుఖవాసికి, పాట సాహిత్యం కోసం కృషిచేసిన వీబీకే మూర్తి కి హృదయపూర్వక అభినందనలు తెలియజేసారు.
తెలుగు వారి ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసే ఈ పాటని ప్రపంచంలోని తెలుగు సంఘాలు, తెలుగు వారందరూ తగిన గుర్తింపు వచ్చేలా ఈ పాటను షేర్ చేసి ప్రోత్సహించాలని ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ పేరు పేరున ఆయన కృతజ్ఞతలు తెలియజేసి కార్యక్రమాన్ని ముగించారు.ఈ కార్యక్రమానికి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరించింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- గిన్నిస్ రికార్డుకు సిద్ధమవుతున్న అయోధ్య!
- కువైట్ లో ది లీడర్స్ కాన్క్లేవ్..!!
- సౌదీలో 23,094 మంది అరెస్టు..!!
- బహ్రెయిన్ లో మెసేజ్ స్కామ్స్ పెరుగుదల..!!
- ప్రపంచ శాంతికి ఖతార్ కృషి..!!
- బర్నింగ్ డాల్ ట్రెండ్ పై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- ROHM లో స్టార్ డయానా హద్దాద్ కాన్సర్ట్..!!
- దోహా చర్చలతో పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ శాంతి ఒప్పందం
- శంకర నేత్రాలయ USA తమ 'అడాప్ట్-ఎ-విలేజ్' దాతలకు అందిస్తున్న ఘన సత్కారం
- నవంబర్ 14, 15న సీఐఐ భాగస్వామ్య సదస్సు–ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు సమీక్ష