బహ్రెయిన్ లో జనన, మరణ ధృవీకరణ పత్రాల నిబంధనల్లో మార్పులు
- November 28, 2022
బహ్రెయిన్: జనన, మరణ ధృవీకరణ పత్రాల నిబంధనల్లో బహ్రెయిన్ మార్పులు చేసింది. జననాలు, మరణాల నమోదుకు సంబంధించిన అప్డేట్ చేసిన విధానాలను యాక్సెస్ చేయడానికి నేషనల్ పోర్టల్(http://bahrain.bh)ని సందర్శించాలని ఇన్ఫర్మేషన్ & ఇ-గవర్నమెంట్ అథారిటీ (iGA) ప్రజలను కోరింది. పోర్టల్ హోమ్‌పేజీని సందర్శించి, ఇన్ఫర్మేషన్ గైడ్‌ని ఎంచుకుని, ఆపై కుటుంబం -సంబంధాల విభాగం ద్వారా అప్‌డేట్‌లను యాక్సెస్ చేయవచ్చని తెలపింది. రాజ్యంలో, విదేశాలలో ఉన్న పౌరుల కోసం జననాలు, మరణాల నమోదును క్రమబద్ధీకరించే 2019 చట్టం నంబర్ 7కు అనుగుణంగా మార్పులు చోటు చేసుకున్నాయని ఐజీఏ పేర్కొంది. కొత్త అప్డేట్ ప్రకారం.. పౌరులు, నివాసితులు రాజ్యంలో జరిగిన జననాలను 15 రోజులలోపు.. మరణాలను 72 గంటల్లోపు నివేదించాల్సి ఉంటుంది. అదే విదేశాల్లో జరిగే జననాలు, మరణాలను 60 రోజుల్లోగా తెలియజేయాల్సి ఉంటుంది. పౌరులు, నివాసితులు తమ జనన ధృవీకరణ లావాదేవీలను పోర్టల్‌లో అందుబాటులో ఉన్న eServices ద్వారా ఆన్‌లైన్‌లో నిర్వహించవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- గిన్నిస్ రికార్డుకు సిద్ధమవుతున్న అయోధ్య!
- కువైట్ లో ది లీడర్స్ కాన్క్లేవ్..!!
- సౌదీలో 23,094 మంది అరెస్టు..!!
- బహ్రెయిన్ లో మెసేజ్ స్కామ్స్ పెరుగుదల..!!
- ప్రపంచ శాంతికి ఖతార్ కృషి..!!
- బర్నింగ్ డాల్ ట్రెండ్ పై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- ROHM లో స్టార్ డయానా హద్దాద్ కాన్సర్ట్..!!
- దోహా చర్చలతో పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ శాంతి ఒప్పందం
- శంకర నేత్రాలయ USA తమ 'అడాప్ట్-ఎ-విలేజ్' దాతలకు అందిస్తున్న ఘన సత్కారం
- నవంబర్ 14, 15న సీఐఐ భాగస్వామ్య సదస్సు–ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు సమీక్ష