అమెజాన్ ఫుడ్ డెలివరీ సేవలు బంద్..
- November 28, 2022
ప్రముఖ ఆన్లైన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఫుడ్ డెలివరీ సర్వీసులను నుంచి తప్పుకుంటుంది. ఇక నుంచి అమెజాన్ ఫుడ్ డెలివరీ సర్వీసులు బంద్ కానున్నాయి. డిసెంబర్ 29 నుంచి ఫుడ్ డెలివరీ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే భాగస్వామ్య రెస్టారెంట్లకు సమాచారం అందించింది. కరోనా పీక్ స్టేజ్‌లో ఉన్నసమయంలో 2020, మే నెలలో అమెజాన్ భారత్‌లో ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించింది.
మొదట బెంగళూరులో ప్రారంభమైన ఈ సర్వీస్‌ను.. క్రమంగా మరికొన్ని ప్రాంతాలకు విస్తరించింది. అయితే విస్తృతంగా ప్రచారం చేయకపోవడం, ప్రత్యేకంగా ఒక యాప్ లేకపోవడంతో వినియోగదారులను అంతగా ఆకర్షించలేకపోయింది. దీనికితోడు అప్పటికే ఫుడ్ డెలివరీ విభాగంలో జొమాటో, స్విగ్గీలు దేశీయ మార్కెట్లో స్థిరపడిపోయాయి. దీంతో ఈ రంగంలో ఆశించినంతగా అమెజన్ రాణించలేకపోయింది.
దీంతో ఈ సర్వీసులను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించామని అమెజన్ స్పష్టం చేసింది. ఫుడ్డెలివరీతోపాటు నిత్యావసరాల హోమ్ డెలివరీ సర్వీసును కూడా అమెజాన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఫుడ్ డెలివరీ సేవలను నిలిపివేస్తుండగా, నిత్యావసరాల సర్వీసును ఎన్నిరోజులు కొనసాగిస్తుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!
- యూఏఈ వెదర్ అలెర్ట్.. భారీ వర్షాలు..వరదలు..!!
- ఖతార్ లో 'టాన్నౌరిన్' బాటిల్ వాటర్ ఉపసంహరణ..!!
- బహ్రెయిన్ లో జోరుగా నేషనల్ ట్రీ వీక్..!!
- పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్..పలువురు అరెస్టు..!!
- ప్రధాని మోదీ సభ పై కూటమి ఫోకస్
- Wi-Fi 8 పరిచయం
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్‌పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!