ఏపీలో పోలీసు నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదల

- November 28, 2022 , by Maagulf
ఏపీలో పోలీసు నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదల

అమరావతి: ఏపీలో పోలీసు నియమకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 315 ఎస్‌ఐ, 96 రిజర్వ్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌, 3,580 కానిస్టేబుల్ (సివిల్‌), 2,520 ఏపీఎస్పీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 6,100 కానిస్టేబుల్‌, 411 ఎస్సై పోస్టులు ఉన్నాయి.అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. కానిస్టేబుల్‌ పోస్టులకు జనవరి 22న, ఎస్సై పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమనరీ రాత పరీక్ష ఉంటుంది.

కాగా, యేటా 6,500 నుంచి 7 వేల వరకు పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని ఇటీవల సీఎం వైఎస్ జగన్‌ పోలీసు శాఖను ఆదేశించారు.ఈ మేరకు పోలీసు శాఖ రూపొందించిన ఉద్యోగాల నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com