వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత..షర్మిల అరెస్ట్
- November 28, 2022
హైదరాబాద్: వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం శంకరం తండా వద్ద షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంకరం తండా వద్ద షర్మిల కాన్వాయ్ వాహనంపై టిఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగడంతో, వైఎస్సార్ తెలంగాణ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.
ఈ క్రమంలో పోలీసులకు, వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ శ్రేణులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో, పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకున్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డిపై షర్మిల చేసిన వ్యాఖ్యలు గులాబీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించాయి. టిఆర్ఎస్ కార్యకర్తలు వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ ఫ్లెక్సీలను చించివేశారు. షర్మిల కాన్వాయ్ లోని ఓ వాహనాన్ని ధ్వంసం చేశారు. దానిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
దీనిపై షర్మిల స్పందిస్తూ.. టిఆర్ఎస్ ప్రభుత్వ కుట్రలో భాగంగానే పాదయాత్రలో బస్సును తగలబెట్టారని ఆరోపించారు. అన్ని అనుమతులు తీసుకుని పాదయాత్ర చేస్తున్నానని, శాంతిభద్రతల సమస్యను చూపించి తనను అరెస్ట్ చేయాలని, తద్వారా పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. పోలీసులను పనోళ్లలాగా వాడుకుంటున్నారని షర్మిల విమర్శించారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







